అప్పట్లో సంచలనం రేపిన 'బాలయ్య - విజయశాంతి' ల వివాదం..?

Anilkumar
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలకృష్ణ, విజయశాంతి లది సూపర్ హిట్ కాంబినేషన్. వీరి కలయికలో పలు సూపర్ హిట్ చిత్రాలు వచ్చి..తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అంతేకాదు అప్పట్లో ఈ జోడికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.వీరిద్దరూ కథానాయకుడు అనే సినిమాలో మొదటిసారి కలిసి నటించారు.ఈ సినిమా బాక్సఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. వీరిద్దరూ దాదాపు 17 చిత్రాల్లో జోడిగా నటించారు. ఇక అప్పటికే అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకుంది విజయశాంతి.ఇక బాలకృష్ణ కూడా తన తండ్రి వారసత్వాన్ని అందుకొని హీరోగా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇదిలా ఉంటె వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు అప్పట్లో పలు వార్తలు ప్రచారం అయ్యాయి.

బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ బ్రతికి ఉన్న సమయంలోనే బాలకృష్ణ.. విజయశాంతిని ప్రేమిస్తున్నట్లు తన తండ్రికి చెప్పాడట. దీనికి ఎన్టీఆర్ ససేమిరా అన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాదు విజయశాంతి నటించే సినిమాల విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ద వహించేవారట. ఆమెను అగ్ర దర్శకుకులకు పరిచయం చేసింది కూడా బాలకృష్ణ అనేది అప్పట్లో ఎక్కువగా ప్రచారం జరిగింది. హీరోయిన్ ని పెళ్లి చేసుకోవద్దని బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ పట్టుబడటంతోనే బాలకృష్ణ ఆ వివాహం చేసుకోలేదని అంటారు. ఆ విషయం ఇంట్లో తెలిసిన వెంటనే ఎన్టీఆర్ సంబంధం చూసి బాలకృష్ణ కు పెళ్లి చేసారని అంటారు.ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య ప్రేమ నడిచిందని వార్తలు వచ్చాయి.

అంతేకాదు బాలకృష్ణ పెళ్లి విషయం తెలిసి విజయశాంతి తీవ్ర మనస్తాపానికి గురై కొన్ని రోజుల వరకు ఆ బాధ నుండి బయటికి రాలేదట. ఆ తర్వాత కొన్నాళ్ళకు శ్రీనివాస్ అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకోవడంతో ఒకరికి ఒకరు దూరమయ్యారని ఎవరికి తోచిన వార్తలు వారు రాసేసారు.ఆ తర్వాత విజయశాంతి సినిమాల్లో కనిపించడం తగ్గించేసారు. ఇక్ కొన్నాళ్ల తర్వాత సినిమాలకు దూరమైన విజయశాంతి రాజకీయాల బాట పట్టారు.ఇక ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతూ.. మళ్ళీ ఇటీవలే మహేష్ నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది ఈ సీనియర్ నటి.మరోవైపు బాలయ్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.ఏదేమైనా బాలకృష్ణ తో ప్రేమ వ్యవహారం వల్ల విజయశాంతి సినీ కెరీర్ కొంత నాశనం అయినట్లు చెప్తుంటారు అప్పటి సినీ జనాలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: