సుధీర్ చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న అక్సాఖాన్..

Divya

సుధీర్ అనడం కన్నా రష్మీ సుధీర్ అంటేనే అందరికీ బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే బుల్లితెరపై వీళ్ళ జోడి అంత ప్రసిద్ధి చెందింది కాబట్టి. రష్మీ లేకుండా సుధీర్ లేడు, సుధీర్ లేకుండా రష్మీ లేదు.. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే వీరిద్దరూ కలసి నటించే తీరు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఉదాహరణకు ఎక్స్ ట్రా జబర్దస్త్ అలాగే ఢీ డాన్స్ షో అని చెప్పవచ్చు. ఈ రెండు ప్రోగ్రామ్ లలో వీళ్ళు చేసే సందడి అంతా ఇంతా కాదు. చూసిన ప్రేక్షకులకు కన్నుల విందుగా కనిపిస్తుంది. అయితే సుడిగాలి సుదీర్ కేవలం కమెడియన్ మాత్రమే కాదు మెజీషియన్ , సహాయ నటుడు అలాగే హీరో కూడా. ఈ మధ్య కాలంలో పలు చిత్రాల్లో కూడా నటించి, మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు..

ఇదిలా ఉండగా ఢీ డాన్స్ షో లో స్టార్ డాన్సర్ గా బాగా పాపులారిటీని సంపాదించుకున్న అక్సా ఖాన్, ప్రస్తుతం తన టాలెంట్ తో  కన్నా  వార్తలతోనేఎక్కువగా సెలబ్రిటీ స్టేటస్ ను  తెచ్చుకోవాలని చూస్తున్నట్లు నెటిజనులు కామెంట్ లు  కూడా పెడుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ఇక ఇప్పటికే అక్సాఖాన్ సుడిగాలి సుధీర్ తో ప్రేమాయణం నడుపుతోందనే పుకార్లు గుప్పుమంటున్నాయి.ముఖ్యంగా చెప్పాలి అంటే ,సోషల్ మీడియాలో ఈ అమ్మాయికి ఉన్నంత క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి రోజు సోషల్ మీడియాలో యాక్టివ్ గా  ఉంటూ, మరింత రెచ్చిపోతూ , తన  ఫోటోలను పెడుతూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
అయితే తాజాగా ఢీ షో లో మరో డాన్సర్ పండు తో కలిసి రొమాన్స్ నడుపుతోందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ అమ్మాయి తనకు సుడిగాలి సుధీర్ అంటే ఎంతో అభిమానం ఉందని, ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. కానీ తన ప్రపోజల్ ను  సుధీర్ సున్నితంగా తిరస్కరించారని ,అతడి సన్నిహితులు కూడా చెబుతున్నారు. కానీ సుధీర్ అక్సాఖాన్ తో "నీ కెరియర్ పైన దృష్టి పెట్టమని" సూచించారట.
కానీ అక్సాఖాన్ మాత్రం ఇవేవీ  తన చెవికి ఎక్కించుకున్నట్లు కనిపించడం లేదని ఆమె సన్నిహితులు వాపోతున్నారు. ఇక తాజాగా పండుతో లవ్ట్రాక్ నడపడం పై కూడా సుధీర్ మందలించినట్లు వినిపిస్తోంది. సుధీర్ తనను ఒక స్నేహితురాలిగా భావించి , ఆమె కెరీర్ ను చక్కదిద్దాలని అనుకుంటున్నాడట. కానీ అక్సా ఖాన్ మాత్రం తనకి  ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ, తన టాలెంట్ ను  పెడమార్గం పట్టించడం పై అభిమానులు సైతం తెగ ఫీల్ అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: