మేనేజర్‌ను చితక్కొట్టాను అంటున్న బుల్లితెర నటి..?
ఇక ఆమె కథ సీరియల్‌లో సహ నటుడు అయిన రవి కృష్ణతో ఈమె ప్రేమ వ్యవహరం నడిపిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక పలు టీవీ షోల్లో, ఈవెంట్లల్లో జంటగా పాల్గొనడంతో వీరి జంటకు మస్తు క్రేజ్ వచ్చింది. అయితే తన నిజ జీవితంలో తనకు జరిగిన ఓ ఘటన గురించి వివరిస్తూ ఎమోషనల్ అయింది ఈ భామ . అదేంటో ఇప్పుడు చూసేద్దాం.
రీసెంట్‌గా నవ్యస్వామి ఓ ఈవెంట్లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో భాగంగా హోస్ట్ కొన్ని ప్రశ్నలు అడిగింది. ‘మీరు ఓ పార్టీలో ఈవెంట్ మేనేజర్‌ను బాగా కొట్టారని తెలిసింది, ఎందుకు అనిహోస్ట్ అడగ్గా.. దానిపై ఆమె వివరణ ఇచ్చింది. ‘ఒకసారి ఫ్రెండ్స్ అందరితో కలిసి పార్టీకి వెళ్లాను. అక్కడ మేమంతా కలిసి డ్యాన్సులు చేస్తున్నాం. మా ఎంజాయ్ లో మేము ఉంటే అక్కడకు ఓ ఈవెంట్ మేనేజర్ వచ్చి నన్ను అసభ్యకరంగా తాకాడు. అందుకే అతన్ని వెనక్కు తోసేసి చితక్కొట్టాను అని చెప్పుకొచ్చింది.