బింబిసారుడుగా కళ్యాణ్ రామ్..!

Suma Kallamadi
నందమూరి తారకరామారావు 98వ జయంతి సందర్భంగా కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. అయితే ఈ సినిమాకి బింబిసార అనే ఒక సరికొత్త టైటిల్ ఖరారు చేశారు. పురాతన మగధ సామ్రాజ్య పాలకుడు, బుద్ధుని మద్దతుదారు అయిన బింబిసారుడు జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. ఫస్ట్ గ్లింప్స్ లో కళ్యాణ్ రామ్ కత్తి పట్టుకొని బాహుబలి తరహా కాస్ట్యూమ్ ధరించి అనాగరిక రాజుగా చాలా కొత్త అవతారంలో కనిపించారు. ప్రస్తుతం విడుదలైన గ్లింప్స్ వీడియోలో ఒక పెద్ద ఖడ్గం పట్టుకుని వందమంది శవాల పై కూర్చొని ఉద్రేకంతో కళ్యాణ్ రామ్ చూస్తున్నారు. ఈ అద్భుతమైన దృశ్యాలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. ఇకపోతే కళ్యాణ్ రామ్ కెరీర్ లో 18వ చిత్రంగా ఈ సినిమా రూపొందనుంది. పాన్ ఇండియా చిత్రంగా రూపొందించనున్న ఈ సినిమా టైటిల్ ని అన్ని భాషల్లో అర్థమయ్యేలాగా ఎంపిక చేశారు.


ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ మొట్టమొదటిగా ఒక పౌరాణిక- ఫాంటసీ చిత్రంలో నటిస్తున్నట్లు అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే చిత్రంలో టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. అంటే పునర్జన్మల కాన్సెప్ట్ తో వచ్చిన మగధీర సినిమాలో రామ్ చరణ్ పాత్రలు మాదిరి బింబిసార చిత్రం లో కూడా కళ్యాణ్ రామ్ మోడ్రన్ మ్యాన్ గా.. అలాగే ఒక రాజుగా ప్రేక్షకుల ముందుకు రానున్నారని తెలుస్తోంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ మూవీగా వస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత మల్లిడి సత్యనారాయణ రెడ్డి తనయుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. కేథరీన్ ట్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ నటించనున్నారని సమాచారం.


ఇకపోతే {{RelevantDataTitle}}