రామ్ చరణ్ రిజెక్ట్ చేసిన 4 బుర్రపాడు సినిమాలు.. !
1.2015 లో విడుదలైన ఓకే బంగారం సినిమా ముందుగా రామ్ చరణ్ వద్దకే వచ్చింది. కాగా ఈ ప్రేమ కథను రామ్ చరణ్ రిజెక్ట్ చేయడంతో హీరో దుల్కర్ సల్మాన్ వద్దకు వెళ్లింది. ఈ సినిమాకు మణిరత్నం దర్శకత్వం వహించగా సినిమాలో హీరోయిన్ గా నిత్యామీనన్ నటించింది. తమిళంలో ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు పరమ బోరింగ్ సినిమా అనిపించింది.
2.రవితేజ హీరోగా నటించిన నేల టికెట్టు సినిమా కథ మొదట చరణ్ వద్దకే వచ్చింది. అయితే కథ నచ్చకపోవడంతో చరణ్ రిజెక్ట్ చేసారు. దాంతో ఈ సినిమా కథ రవితేజ వద్దకు వెళ్లింది. ఆయకు నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది.
3.నాని హీరోగా నటించిన ప్రేమ కథా చిత్రం ఎటో వెళ్లిపోయింది మనసు చిత్రం కూడా మొదటగా చరణ్ వద్దకే వచ్చింది. కానీ ఆరెంజ్ సినిమాతో దెబ్బతిన్న చరణ్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు. దాంతో గౌతమ్ మీనన్ నానిని ఒప్పించారు. నాని సమంత జంటగా నటించిన ఈ సినిమా అతికొద్దిమంది ప్రేక్షకులకే నచ్చింది.
4.డబుల్ యాక్షన్ చిత్రం క్రిష్ణార్జున యుద్దం కూడా మొదట రామ్ చరణ్ వద్దకే వచ్చింది. అయితే చరణ్ నో చెప్పడంతో ఈ సినిమా కూడా నాని వద్దకు చేరింది. కథ నచ్చడంతో నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రానికి మేర్లపాక్ గాంధీ దర్శకత్వం వహించారు. అయితే చరణ్ రిజెక్ట్ చేసిన ఈ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ ను మూటగట్టుకుంది.