తన అందాలతో రచ్చ చేస్తున్న సీరియల్ నటి..
ఇటీవల కాలంలో చాలా మంది బుల్లితెర స్టార్స్, వెండితెరపై అవకాశాలు దక్కించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తమ హాట్ చిత్రాలను కెమెరాలో బంధించి మరీ, సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నారు. ఇక అందులో ఒకరు దీపికా సింగ్ కూడా.. ఈమె పేరు వినగానే "ఈతరం ఇల్లాలు" సీరియల్ గుర్తొస్తుంది. ఇక ఈ సీరియల్ గురించి ఏ ఇల్లాలిని అడిగినా చెప్పేస్తారు. ఇక ఈ సీరియల్ హిందీ సీరియల్ అయినప్పటికీ , తెలుగులో డబ్ చేసి సూపర్ హిట్ అందుకుంది ఈతరం ఇల్లాలు.
ఇందులో సంధ్య పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి, తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. ఇక ఈ సీరియల్ పూర్తి అయి 4 సంవత్సరాలు అయినప్పటికీ ఈ సీరియల్ ను ఇప్పటికీ మర్చిపోలేదు మన బుల్లితెర అభిమానులు.. అయితే ఈ సీరియల్ లో ఎంతో పద్ధతిగా చూడచక్కని ఇల్లాలిగా కనిపించే ఈ బ్యూటీ, రియల్ లైఫ్ లో మాత్రం హాట్ లుక్స్ తో రెచ్చిపోతోంది. ఇక ఇటీవల ట్రోల్ కి కూడా గురైన విషయం అందరికీ తెలిసిందే.
దీపికా సింగ్ 1989 జూలై 26న ఢిల్లీలో జన్మించింది. ఇక ఈమె ఎంబీఏ వరకు తన చదువును కంప్లీట్ చేసి, తరువాత హిందీ సీరియల్స్ లోకి అడుగుపెట్టింది. ఇక ఇందులో 2011లో స్టార్ ప్లస్ లో ప్రసారమైన దియా ఔర్ బాతే హమ్ సీరియల్ లో నటించి, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. 2014 - మే - 2 న టెలివిజన్ డైరెక్టర్ అయిన రోహిత్ రాజ్ తో వివాహం జరిగింది. వీరికి ఒక అబ్బాయి కూడా జన్మించాడు. ఈమె కేవలం నటి మాత్రమే కాదు ఒడిస్సీ క్లాసికల్ డాన్సర్ కూడా.
ఇదిలా ఉండగా ప్రస్తుతం దీపికా సింగ్ బటన్స్ విప్పిన షర్ట్ లో ఫోటోలకు ఫోజులు ఇస్తూ ,కుర్రకారుకు మతి పోగొడుతోంది. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా , అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను మీరు కూడా చూసేయండి.