ఇంట్రెస్టింగ్ టైటిల్ తో వస్తున్న శిరీష్..?
ఈ పోస్టర్‌తో తన కొత్త సినిమా టైటిల్‌తో పాటు మూవీ దర్శకుడికి సంబంధించిన విషయాలపై శిరీష్ క్లారిటీ ఇచ్చాడు. ఈ హీరోకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్గా నటిస్తోంది. అను కూడా చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్లోసినిమా చేస్తోంది. అయితే టైటిల్‌తోనే ఆసక్తి రేకెత్తించారు డైరెక్టర్. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు రెండు రోజులుగా హల్ చల్ చేస్తున్నాయి.
ఇక ఈ రోజు రెండు పోస్టర్స్ విడుదల చేయగా, ఇవి రెండు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నాయి. ఈ పోస్టర్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా పక్కా రొమాంటిక్ లవ్ స్టోరీ యాంగిల్లో నడుస్తోందని అర్ధమవుతుంది. లవ్ అండ్ రిలేషన్ షిప్ ల మధ్య సరికొత్త కోణాన్ని చూపించాలని డైరెక్టర్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. ఇందులో శిరీష్ సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు. ఈరోజు అల్లు శిరీష్ బర్త్ డే కానుకగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటుంది. మరి ఈ సినిమాతో అయినా పెద్ద హిట్ అందుకోవాలని శిరీష్ ప్రయత్నిస్తున్నాడు. మరి అనుకున్నట్టు సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.