ఆ ఒక్క తప్పిదమే హీరో హరనాథ్ ప్రాణాలు తీసింది
ముఖ్యంగా ఆయన నడక చాలా స్టైల్ గా ఉండేది అని అప్పట్లో అమ్మాయిలు చెప్పుకునే వారట. ఒక వైపున ముఖ్యమైన పాత్రలు, మరోవైపు హీరోగా చేస్తూ ఆయన తన కెరీర్ ని సాగించారు. పౌరాణికాల్లో తాను ఇతర ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నప్పుడు రాముడు కృష్ణుడు విష్ణువు పాత్రలను ఎన్టీఆర్ చేయించేవారు అంటే ఆయన రూపం ఎంత ఆకర్షనీయమైనదో అర్థం చేసుకోవచ్చు. తన కెరీర్ ఒక రేంజ్ లో సాగుతుండగా మద్యం అలవాటు మరింతగా పెరుగుతూ వెళ్ళింది. ఎంత హ్యాండ్సమ్ గా ఉండే ఆయన ఎప్పుడూ మద్యంలో ఉండడం సన్నిహితులకు ఎంతో బాధ కలిగించిందట.
ఎవరు ఎంతగా చెప్పినా ఆయన వినిపించుకోలేదు. మద్యం సేవించి ఆయన షూటింగ్ కి రావడం మీద ఆర్టిస్టులకు ఇబ్బంది కలిగించింది. విపరీతంగా తాగడం వలన ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దాంతో అవకాశాలు దూరమవుతూ వచ్చాయి. ఆ సమయంలో ఆయన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారట. మద్యం కారణంగానే ఆయన మరణానికి చేరువయ్యారు. మంచి అందగాడు, విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న వాడు ఇలా మద్యం వల్ల తన కెరీర్ని నాశనం చేసుకోవడం ఆయన అభిమానులను ఇప్పటికీ బాధిస్తుంది అని చెప్తున్నారు.