సినిమా అడిగిన కృష్ణ‌.. మూడేళ్ల త‌ర్వాత క‌నిపించ‌మ‌న్న ఎన్టీఆర్‌

Mamatha Reddy
తెలుగు సినిమా పరిశ్రమలో తమదైన టైంలో స్టార్ హీరోలు గా ఓ వెలుగు వెలిగి ఎంతోమంది నటులకు ఆదర్శంగా నిలిచారు దివంగత ఎన్టీఆర్ మరియు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్నో రకాల వైవిధ్యభరితమైన పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచిన ఎన్టీఆర్ తో సమానమైన క్రేజ్ ను దక్కించుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. పౌరాణిక చారిత్రక పాత్రల కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఎన్టీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో కృష్ణ ను పొగిడారు.. సాంఘిక చిత్రాల్లో ఎక్కువగా నటించే సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్ చేయని పాత్రలను ఎక్కువగా చేసి ప్రేక్షకుల అభిమానాన్ని ఎక్కువగా సంపాదించుకున్నారు.

18 సంవత్సరాల వయసులో తన తన అభిమాన నటుడిని తొలిసారి వ్యక్తిగతంగా కలుసుకున్నారు కృష్ణ. అప్పుడు ఎన్టీఆర్ సీతారామ కళ్యాణం ను స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్నారు. అందులో రాముడు వేషం తనకు ఇవ్వాల్సిందిగా అడిగారు కృష్ణ. ఇంకా చిన్న వాడిలా కనిపిస్తున్న కారణంగా ఆయనను చూసి రాముడు వేషానికి అప్పుడే నువ్వు సరిపోవు. లక్ష్మణుడు వేషం ఇద్దాం అంటే ఇప్పటికే దానికి శోభన్ బాబు ని ఎంపిక చేశాము. మూడేళ్ల తర్వాత కనిపించు అని చెప్పి పంపించారు ఎన్టీఆర్. ఆయన చెప్పినట్లుగానే బుర్రిపాలెం వెళ్లిపోయి మళ్లీ మూడేళ్ల తర్వాత ఇండస్ట్రీ కి వచ్చారు అయితే ఎన్టీఆర్ దగ్గరకు వెళ్ళకుండా ఆదుర్తి సుబ్బారావు దృష్టిలో పడి తేనె మనసులు తో హీరోగా పరిచయమయ్యారు కృష్ణ.

ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎన్టీఆర్ ని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారట కృష్ణ. ఆ తరువాత రెండేళ్లకు తన అభిమాన నటుడితో కలిసి నటించే అవకాశం వచ్చింది కృష్ణకు. ఆ సినిమా స్త్రీ జన్మ..  డి.రామానాయుడు నిర్మాణంలో కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అన్నదమ్ములుగా నటించారు ఎన్టీఆర్, కృష్ణ. ఆ సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వీరిద్దరూ చాలా సినిమాల్లో అన్నదమ్ములుగా నటించారు. నిలువు దోపిడి (1968), విచిత్ర కుటుంబం (1969), దేవుడు చేసిన మ‌నుషులు (1973), వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు (1982) చిత్రాల్లో వారు బ్ర‌ద‌ర్స్‌గానే న‌టించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: