తెలుగు ప్రజలకు సోనూసూద్ సాయం..?

Suma Kallamadi
నటుడు సోనూసూద్ ను ప్రజలు దేవుడిగా భావిస్తున్నారు. రీల్ లైఫ్ లో విలన్ గా నటించే సోనూసూద్ మాత్రం రియల్ లైఫ్ లో హీరో అని దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసిస్తున్నారు. సోనూసూద్ కి ఇంత మంచి పేరు రావడానికి అతడు చేస్తున్న సేవ కార్యక్రమాలే కారణం. దేశవ్యాప్తంగా సేవ చేస్తున్న సోనూసూద్ తాజాగా తెలుగు రాష్ట్రాల‌ ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మృతదేహాల సంరక్షణ కోసం మార్చురీ డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను సోనూసూద్ ఇస్తున్నారు. సానికిరెడ్డి పల్లి, ఆషాపూర్, బోంకూర్, ఓర్వకల్, మడ్డికేరా ఇంకా ఇలాంటి ఎన్నో గ్రామాల్లో డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులను సోనూసూద్ సాయంతో ఏర్పాటు చేస్తున్నారు. అనేక గ్రామాల్లో డెడ్ బాడీ ఫ్రీజర్ బాక్సులు లేకపోవడంతో ఆయా గ్రామాల సర్పంచ్ లు సాయం కోరుతూ సోనుసూద్ ను సంప్రదించారు. దీంతో సోనూ సూద్ ఆయా గ్రామాలకు సాయం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ గ్రామాలకు డెడ్ బాడీ ఫ్రీజర్ లను సమకూర్చారు. త్వరలోనే ప్రతీ గ్రామంలో బాడీ ఫీజర్ లను ఏర్పాటు చేస్తానని నటుడు సోనూసూద్ హామీ ఇచ్చారు.
ప్రస్తుతం సోనూసూద్ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికీ సాయం చేస్తూ వస్తున్నాడు. దేశమంతా ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆక్సిజన్ అవసరం ఉంటే డీటీడీసీ ద్వారా అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్స్ పంపిస్తామని సోనూసూద్ తెలిపారు. గతేడాది కరోనా కాలం మొదలైనప్పటి నుంచి కష్టంలో ఉన్న ఎందరికో సోనూసూద్ సాయం చేస్తూ వస్తున్నారు. సొంత ఖర్చులతో పేదవారిని ఆదుకుంటున్నారు. ఆక్సిజన్ ప్లాంట్స్‌ను జెట్ స్పీడ్‌లో నిర్మించి ఎంతోమందికి ఊపిరి పోస్తున్నారు. సెకండ్ వేవ్ లో బెడ్స్, మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్లు.. ఇలా బాధితులకు ఏది అవసరం ఉంటే వాటిని సాయం చేస్తున్నాడు. దేశం నలుమూలలా సాయాన్ని అందజేస్తున్న సోనూసూద్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సైతం సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: