పూరీ నా శత్రువు.. రాజమౌళి తండ్రి షాకింగ్ కామెంట్..!

Chakravarthi Kalyan
ప్యాన్ ఇండియా.. ఈ పదం ఎక్కువగా సినిమాలకు వాడుతుంటాం. పాన్ ఇండియా మూవీ.. పాన్ ఇండియా డైరెక్టర్, పాన్ ఇండియా యాక్టర్ అంటూ కొందరి గురించి చెబుతుంటాం. కానీ పాన్ ఇండియా రైటర్ కూడా ఉంటారని ఆయన నిరూపించారు. ఆ రచయిత తెలుగువాడు కావడం విశేషం. ఆయనే సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్. 1988లో జానకి రాముడు సినిమా మొదలు.. బాహుబలి, rrr వరకూ ఎన్నో చిత్రాలకు కథలు అందించారు.

బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, సింహాద్రి, సై, చత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మెర్సల్, మణికర్ణిక లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కథలు అందించింది విజయేంద్ర ప్రసాదే. ఆయన దర్శకుడు రాజమౌళి తండ్రి అన్న విషయం తెలిసిందే. అయితే.. స్వయంగా పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళికి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్.. మరో డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌కు అభిమానిఅట.

రాజమౌళి కాకుండా మీకు తెలుగులో బాగా నచ్చే డైరెక్టర్ ఎవరంటే.. పూరీ పేరే చెబుతారాయన. అయితే పూరీ జగన్నాథ్‌ ను ఆయన తన శత్రువుగా చెప్పడం విశేషం. పూరీ జగన్నాథ్ లోని రైటింగ్ స్కిల్స్ కు తాను జెలసీగా ఫీలవుతానంటారు విజయేంద్ర ప్రసాద్.. సినిమాల్లో హీరోయిజం చూపించాలంటే.. ఓ చక్కటి ఘట్టం ఉండాలని.. ఓ మూమెంట్‌లో హీరో విరుచుకుపడితే చూడాలని జనం కోరుకుంటారని విజయేంద్రప్రసాద్ అంటారు.

అయితే అలాంటి సీన్ తెచ్చేందుకు తాము రెండు, మూడు రీళ్ల సమయం తీసుకుంటే.. పూరీ మాత్రం అతి తక్కువ సమయంలోనే అలాంటి సీన్ అద్భుతంగా రాస్తారని.. విజయేంద్ర ప్రసాద్‌ మెచ్చుకున్నారు. అందుకే తనకు పూరీ అంటే ఇష్టమని.. ఆ టెక్నిక్ నేర్చుకుందామని ప్రయత్నిస్తున్నానని నిజాయితీగా చెబుతారు విజయేంద్ర ప్రసాద్. అందుకే తాను తన మొబైల్ ప్రొఫైల్ పిక్‌ గా పూరీ జగన్నాథ్ నే పెట్టుకున్నానని చెప్పారు విజయేంద్ర ప్రసాద్. మరి అంతగా పాన్ ఇండియా రైటర్ మనసు చూరగొన్న పూరీ జగన్నాథ్‌ను అభినందించాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: