కోలీవుడ్ స్టార్స్ మధ్య వార్.. నెట్టింట వైరల్..
ఒకేసారి ఈ ముగ్గురు అగ్ర హీరోలు పోటీకి దిగడానికి సిద్ధమైనట్లు టాక్ వైరల్ అవుతుంది. రజనీకాంత్, అజిత్, విజయ్ వంటి కోలీవుడ్ స్టార్స్ బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ కు రెడీ అయినట్లు సమాచారం తెలుస్తోంది.సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నత్తే సినిమా ఈ ఏడాది దీపావళికి రానున్నట్లు ముందే క్లారిటీ ఇచ్చేశారు. శివ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక మరోవైపు తల అజిత్ 'వాలిమై' కూడా దీపావళికి రానున్నట్లు టాక్ వస్తోంది. ఈ సినిమాకు హెచ్.వినోథ్ దర్శకత్వం వహిస్తున్నడు.ఇక ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో అత్యదిక మార్కెట్ ఉన్న హీరోగా కొనసాగుతున్న విజయ్ 65వ సినిమా సైతం 2021 దీపావళికి రానున్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వస్తోంది. ఈ సినిమాను నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విధంగా స్టార్ హీరోలు పోటీ పడితే అభిమానులను ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.