తన కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన జెనీలియా..

Divya

సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన అంద చందాలతో అనతి కాలంలోనే మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ జెనీలియా కూడా ఒకరు. ఈమె  సిద్ధార్థ సరసన బాయ్స్ సినిమాలు నటించి తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యింది. ఇక ఆ తర్వాత
ఢీ , రెడీ, బొమ్మరిల్లు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు  బాగా దగ్గరైన హీరోయిన్ జెనీలియా. ఇక అంతే కాకుండా బొమ్మరిల్లు చిత్రం ద్వారా ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఈ బ్యూటీ బాలీవుడ్ హీరో "రితేష్ దేశ్ ముఖ్" ని పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తోంది. పెళ్లయిన తర్వాత కూడా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ సినీ కెరీర్ ను కొనసాగిస్తుంటే , జెనీలియా మాత్రం పెళ్లయిన తర్వాత, తన పూర్తి జీవితాన్ని కేవలం కుటుంబానికి మాత్రమే కేటాయించింది. ఇక అందులో భాగంగానే తన పిల్లల బాగోగులు చూసుకుంటూ , ఆమె ఆనంద జీవితం గడుపుతూ ఉందని, పలు సందర్భాలలో, ఆమె స్వయంగా చెప్పుకొచ్చిన విషయం కూడా తెలిసిందే.

ఇదిలా ఉండగా జెనీలియా కొడుకు రాహుల్ 5 వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తన ముద్దుల కొడుకు తో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది జెనీలియా.


అయితే తన కొడుకు రాహుల్ బర్తడే విషెస్ చెబుతూ ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది జెనీలియా.."  ఈరోజు నీవు  పుట్టిన రోజు. నువ్వు నాకు ఎంత ముఖ్యమో చెప్పడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటున్నాను. నేను కూడా తప్పులు చేస్తున్నాను..నేను కొంచెం వెర్రి దాని లాగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. అయితే నాకు సంబంధించిన అన్ని అధ్వాన్నమైన విషయాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం నీ బాగోగులు చూసుకోవడంలో నిమగ్నమైపోయాను.  నేను ప్రపంచంలో ఉత్తమ తల్లిని..నువ్వు నా  చిన్న రాహుల్ వి అని నాకు అనిపిస్తుంది. ఎప్పటికీ నా హృదయాన్ని దొంగలించిన బాలుడు, నా సుపుత్రుడు"  అంటూ తన కొడుకు గురించి భావోద్వేగ పోస్టు పెట్టింది జెనీలియా. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: