"సర్కార్ వారి పాట" సినిమా ఆమె సంతకం తోనే మలుపు తిరగనుందా ?
నదియా ప్రముఖ సినీ నటి ఈమె అసలు పేరు జరీనా. వృత్తిరీత్యా నదియా గా పేరు మార్చుకుంది. ఈమె ఎక్కువగా తమిళ్ మలయాళ సినిమాలలో నటించింది ఒక తెలుగు సినీ ఇండస్ట్రీకి వస్తే కేవలం కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. 2013 వ సంవత్సరంలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమాలో ప్రభాస్ తల్లిగా నటించి అందరినీ మెప్పించింది. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన "అత్తారింటికి దారేది " సినిమాలో అత్త పాత్రలో అత్యద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీకి దూరమైన అయితే నదియా ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా ద్వారా తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతోంది. సర్కార్ వారి పాట సినిమాలో ఆమె ఒక బ్యాంకు ఉన్నతాధికారి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఈ సినిమాలో ఈమె పెట్టే సంతకం తోనే సినిమా కథ మలుపు తిరుగుతుంది అని వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఆమె తెలుగులో మళ్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా రోజుల తర్వాత వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే నదియా అభిమానులకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు.