ప్రభాస్ వెంట పడుతున్న బాలీవుడ్ ప్రొడ్యూసర్..

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి చెప్పాలంటే మిర్చికి ముందు ప్రభాస్ మిర్చి తరువాత ప్రభాస్ అని చెప్పాలి. మిర్చికి ముందు ప్రభాస్ కూడా స్టార్ హీరోనే కాని మిగతా స్టార్ హీరోలతో పోల్చుకుంటే ప్రభాస్ ఆమడ దూరంలో వున్నడనే చెప్పాలి. మంచి మంచి హిట్ సినిమాలు వున్న ప్రభాస్ మార్కెట్ మాత్రం కేవలం 40 కోట్ల లోపే ఉండేది. కాని మిర్చి సినిమాతో ఎలాగోలా 40 కోట్ల మార్కెట్ సాధించాడు. అది మిర్చి దాకా ప్రభాస్ కి వున్న రేంజ్. ఇక మిర్చి తరువాత ప్రభాస్ గురించి చెప్పాలంటే.. ఒక్క మాటలో చెప్పలేము. పెద్ద చరిత్రని సృష్టించాడు. అది ఎంత పెద్ద రికార్డు అంటే ఇండియాలోని ఏ స్టార్ ఇప్పటిదాకా అలాగే మరికొన్ని సంవత్సరాల దాకా ఎవ్వరు టచ్ చెయ్యలేని రికార్డు. ఆల్రెడీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సిరీస్ తో ప్రభాస్ తెలుగు సినిమా పరిశ్రమనే కాకుండా భారతీయ సినిమా పరిశ్రమనే ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్లాడు.

ఇక ఇండియాలోనే ఇప్పుడు ప్రభాస్ పెద్ద మార్కెట్ వున్న హీరో. ఇప్పుడు ప్రభాస్ మార్కెట్ ని రేంజ్ ని ఒక్క తెలుగు హీరోనే కాదు ఏ పాన్ ఇండియా హీరో కూడా అందుకోలేక ఆమడ దూరంలో వున్నారు.ఇక బాహుబలి సిరీస్ తరువాత తన ప్రతి సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో చేస్తున్నాడు. ఎందుకంటే ప్రభాస్ అంటే పడి చచ్చిపోయే ఫ్యాన్స్ ఇప్పుడు దేశం నలుమూలల వున్నారు.అందుకే తన ఫ్యాన్స్ కోసం ఏమాత్రం తగ్గకుండా బాహుబలి రేంజ్ కి తగ్గట్టు అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు.ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ తొందర్లో రాధేశ్యాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సరే ఇదంత తెలిసిన విషయమే కదా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా.. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ కోసం బాలీవుడ్ ప్రాడ్యూసర్స్, డైరెక్టర్స్ క్యూ కడుతున్నారు.తాజాగా బోనీ కపూర్ ప్రభాస్ తో సినిమా చెయ్యాలని బలంగా కోరుకుంటున్నాడు. అందుకోసం తాను ప్రభాస్ తో చెయ్యబోయే సినిమాలో ప్రభాస్ కి ఖచ్చితంగా షేర్ ఇస్తాడట.ఇప్పటికే ప్రభాస్ హిందీలో ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు. ఇక బోనీ కపూర్ సినిమా కూడా చెయ్యడానికి సముఖంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. దీని గురించి పూర్తి విషయాలు తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: