ఘట్టమనేని వదిన మరదళ్లు ఎలా ఉంటారో తెలుసా ?

Divya

సినీ ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీ అంటే ఎంతో క్రేజ్ ఉంది. అందుకు కారణం సూపర్ స్టార్ కృష్ణ తో మొదలైన ఘట్టమనేని ఆస్థానం అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు ను సూపర్ స్టార్ గా నిలబెట్టింది. ఇక టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా లేడీస్ విషయంలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు.. ఇక అతని భార్య నమ్రతా శిరోద్కర్ నిత్యం, తన భర్త సినిమాల ప్రమోషన్ చూసుకుంటూ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా మహేష్ బాబు చేస్తున్న బిజినెస్ కూడా తనే చూసుకుంటోంది. అయితే మహేష్ సోదరి,  ప్రముఖ నిర్మాత, దర్శకురాలు అయిన మంజుల ఘట్టమనేని, నమ్రత లు వీరిద్దరూ నిజ జీవితంలో ఎలా ఉంటారో ? అనే విషయం ఇప్పుడు ఒకసారి చూద్దాం.

తాజాగా వీరిద్దరి గురించి తెలుసుకోవాలనే తపన అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా ఎక్కువగా ఉంటుంది . అయితే తాజాగా ఈ విషయాన్ని బయటపెట్టింది మహేష్ బాబు సోదరి మంజుల. నమ్రత తో దిగిన ఫోటోలు తన ట్విట్టర్లో షేర్ చేసిన మంజుల.. " నేను నమ్రతతో గడిపే సమయాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటాను. ఆమె నా మరదలు మాత్రమే కాదు నాకు మంచి ఫ్రెండ్ కూడా. ఈ సూపర్ ఉమెన్ నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది  " అంటూ నమ్రతా పై ఎంతో గొప్పగా చెప్పింది.
ఇక ప్రస్తుతం ఈమె పెట్టిన పోస్ట్ బాగా వైరల్ గా మారింది. ఈ విషయం  షో, నాని, పోకిరి, ఏమాయ చేసావే వంటి చిత్రాలను నిర్మించిన మంజుల, సందీప్ కిషన్ తో ' మనసుకి నచ్చింది'అనే చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం ఈమె ఓ వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వెబ్ సిరీస్ షూటింగ్ ఆగిపోయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: