బాలు గాత్రంలో ఎన్నో పాటలు కొత్తదనాన్ని సంతరించుకున్నాయి. బహుముఖ ప్రజ్ఞాశాలిగా తనదైన శైలిలో పాటలు పాడిన ఆయన.. సినీ సంగీత అభిమానులను ఓలలాడించారు. సుమారు 40 వేల పాటలు విభిన్న భాషల్లో బాలు పాడారు. భారతీయ సినీ ప్రపంచంలో ఇంకెవరికీ సాధ్యం కాని చరిత్రను సృష్టించారు. ఆయన చివరిసారిగా పాడిన పాట ‘పలాస 1978’ సినిమాలోని ‘ఓ సొగసరి’ పాట. లక్ష్మీ భూపాల రాసిన పాటను రఘు కుంచె స్వరపరిచారు. బాలు, బేబి పాడారు. బాలసుబ్రమణ్యం మొత్తంగా 50 సినిమాల వరకు సంగీతం అందించారు. తెలుగులో 30 సినిమాలు, కన్నడలో 9 చిత్రాలు, తమిళ్లో 5, హిందీలో 2 సినిమాలకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారు బాలు. అయితే ఒక 15 ఏళ్ల వరకు సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఢబుల్ షిప్టులు పనిచేసిన బాలసుబ్రమణ్యం తొంభైల్లో సంగీతం నుంచి బ్రేక్ తీసుకున్నారు. సింగింగ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. గాయకుడిగా శిఖరాగ్ర ఖ్యాతనార్జిన బాలు స్వర కర్త గా కూడా గౌరవాన్ని పోందారు. బాల సుబ్రమణ్యం సంగీత ప్రపంచానికి అందించిన సేవలకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన సత్కారాల కంటే ప్రేక్షకుల గుండెల్లో ఒక మంచి పాట గా మిగిలిన జ్ఞాపకంగానే ఆయన గర్తుండిపోతారు. ఆయన పాడిన పాటల్లో ముఖ్యంగా నిలిచేవి ఏ పాటలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రేమ లేదని పాట ఆరాధన సినిమాలోనిది. కార్తిక్, శోభన, శరత్ బాబు లీడ్ రోల్స్ లో వచ్చిన ఈ మూవీని అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇళయరాజా బాణీలందించారు. ప్రియతమా..పాట ప్రేమా చిత్రంలోనిది. రామానాయుడు నిర్మించగా మంచి రొమాంటికల్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా విజయం సాధించింది. వెంకటేష్ కు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. రుద్రవీణ సినిమా అనేది యువకుడు అయినా సూర్యం ( చిరంజీవి ), అతని తండ్రి బిల్హరి గణపతి శాస్త్రి మధ్య సిద్ధాంత పోరుకు సంబంధించిన చిత్రం. ఇందులో తరలిరాదే తనే వసంతం పాట బాలు పాడారు.
మహర్షి -1987 సినిమాలో మాటరాని మౌనమిది..పాటను బాలునే పాడింది. మణిరత్నం తెరకెక్కించిన చిత్రాల్లో టాప్ లో ఉండే చిత్రం గీతాంజలి. ఈ మూవీలో పాటలు నేటికీ చాలా సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. నాగార్జున గీతాంజలి సినిమాలో ఓ పాపా లాలి పాటను పాడారు. అలాగే ఆలాపన సినిమాలో ఆవేశమంతా పాట బాగా నిలిచిపోయింది. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఇంద్రుడు చంద్రుడు సినిమాలో లాలిజో లాలిజో పాట అంటే చాలా మందికి ఇష్టం. మంచి మనసులు సినిమాలో జాబిల్లి కోసం పాట లవ్ ఫెయిల్యూర్స్ కు చచ్చేంత ప్రాణం. అభిలాష సినిమాలో యూరేకా అనే పాట కుర్రకారు మరిచిపోలేరు. అన్వేషణ సినిమాలో కీరవాణి సాంగ్ ఇప్పటికీ అందరి నోళ్లలో మెదులుతూ ఉంటుంది.