టాలీవుడ్ టాప్ 10 హీరోల భార్యల ప్రొఫెషనల్ లైఫ్ గురించి తెలుసా.. ?
రామ్ చరణ్ భార్య ఉపాసన అపోలో ఛారిటీ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూనే బి పాజిటివ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు ఆమె ఏడాది సంపాదన చరణ్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువే ఉంటుంది. మహేష్ బాబు కు సంబంధించిన యాడ్ అగ్రిమెంట్ ఏఎంబి మూవీస్ నిర్వహణతో పాటు రీసెంట్ గా స్టార్ట్ చేసినా ది హంబుల్ గో కూడా నమ్రత నే డీల్ చేస్తున్నారు. అల్లు అర్జున్ సతీమణి స్నేహ రెడ్డి స్పెక్ట్రమ్ మ్యాగజైన్ కి చీఫ్ ఎడిటర్ గా ఉన్నారు. అంతేకాకుండా తన తండ్రికి సంబంధించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ వ్యవహారాన్ని కూడా ఆమె చూసుకుంటుంది.
రీసెంట్ గా పిక్ ఏ బూ అనే ఒక సెలబ్రిటీ ఫోటోగ్రఫీ బిజినెస్ ను కూడా స్టార్ట్ చేసింది. నాని సతీమణి అంజనా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం ఆర్కా మీడియా లో కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ భార్య చిన్మయి సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తూ ఉంది. సమంత కి డబ్బింగ్ చెప్పేది ఈమె. అల్లరి నరేష్ సతీమణి నిరూప హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ఈవెంట్ మేనేజర్. రాజీవ్ కనకాల భార్య సుమ బుల్లితెర యాంకర్ గా రాణిస్తోంది.