హ‌నుమంతుడి జన్మస్థలంపై బ్ర‌హ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు..?

Suma Kallamadi
గ‌త కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఓ పెద్ద‌వివాదం న‌డుస్తోంది. అది మ‌నుషుల‌కు సంబంధించింది కాదు.. దేవుడి జ‌న్మ‌స్థ‌లంపై న‌డుస్తోంది. ఆంజ‌నేయ స్వామి జ‌న్మ‌స్థ‌ల‌పై టీటీడీకి టీటీడీ, కిష్కింద సంస్థాన్ ట్ర‌స్టుకు మ‌ధ్య పెద్ద ఎత్తున వివాదం జ‌రుగుతోంది. ఆంజ‌నేయ‌స్వామి మా వ‌ద్ద పుట్టాడంటూ ఇరు వ‌ర్గాలు ప‌ర‌స్ప‌ర వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఎప్పుడైతే ఆంజ‌నేయ స్వామి తిరుమ‌ల కొండ‌పైనే పుట్టాడంటూ టీటీడీ ప్ర‌క‌ట‌న చేసిందో అప్ప‌టి నుంచే ఈ వివాదం ముదిరింది.

అయితే ఇప్పటికే ఈ విష‌యంపై ఎంతో మంది స్పందించారు. రాజ‌కీయ నాయ‌కుల ద‌గ్గ‌రి నుంచి సామాన్య జ‌నం వ‌ర‌కు దీనిపైనే మాట్లాడుకుంటున్నారు. ఇక దీనిపై ఇప్పుడు బ్ర‌హ్మానందం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మామూలుగానే ఆయ‌న హిందువుల దేవుళ్లంటే ఎంతో భ‌క్తితో కొలుస్తారు. దేవుళ్ల‌పై ఆయ‌న‌కు కాస్త భక్తి ఎక్కువే అని చెప్పాలి. ఇక నిజ‌మైన భ‌క్తికి ఆంజనేయ స్వామి నిదర్శనం అని బ్ర‌హ్మానందం వెల్ల‌డించారు.

ఇప్పుడున్న క్లిష్ట ప‌రిస్థితుల్లో ఆంజనేయస్వామి  జ‌న్మ‌స్థ‌లంపై వివాదం సృస్టించ‌డం ఎంత‌మాత్రం మంచిది కాద‌ని, ఆయ‌న అంద‌రి వాడంటూ చెప్పుకొచ్చారు న‌వ్వుల రారాజు. ఆంజ‌నేయ స్వామి అంద‌రివాడ‌ని, ఆయ‌నను కొలుచుకునే భాగ్యం దొరికినందుకు సంతోష‌ప‌డాల‌ని చెప్పారు. భ‌గ‌వంతుడు మ‌న‌కు ఇచ్చిన జ‌న్మ‌కు ప్ర‌తిఫ‌లంగా ఆయ‌న‌ను పూజించుకుంటే స‌రిపోతుంద‌న్నారు.

అంతేగానీ ఇప్పుడున్న ఈ ప‌రిస్థితుల్లో ఆంజ‌నేయ స్వామి ఎక్క‌డ పుట్టాడ‌నే దానిపై వివాదం పెట్టుకోవ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. దానికంటే కూడా ఆంజ‌నేయుడు భారత దేశంలో పుట్టారని గర్వపడితే అంద‌రికీ మంచిదని త‌న‌దైన స్టైల్‌లో వ్యాఖ్యానించారు బ్ర‌హ్మానందం. అందుక‌ని ద‌య‌చేసి ఎవ‌రూ ఈ విష‌యంపై వివాదాస్ప‌దంగా చూడ‌కుండా స‌మిష్టి కోణంలో చూడాల‌ని కోరారు. అయితే ఈ వివాదంపై మాత్రం ఓ స్ప‌ష్టత రావ‌ట్లేదు. దీనిపై టీటీడీ మాట‌ల యుద్ధం కొన‌సాగుతూనే ఉంది. చూడాలి మ‌రి దీన్ని ఇంకా ఎలా ప‌రిష్క‌రిస్తారో ఎలా ముందుకు తీసుకెళ్తారో అంటూ అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: