టాలీవుడ్ లో షూటింగ్ లు మొదలయ్యేది ఎప్పుడంటే ?

VAMSI
ప్రస్తుతం భారతదేశం అంతా కరోనా వైరస్ గుప్పెట్లో బంధీగా ఉంది. రెండు సంవత్సరాలుగా ఈ మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తోంది. దశల వారీగా మన దేశంపై దండెత్తి వస్తోంది. మొదటి దశలో ఇది ఎక్కువగా వృద్దులనే లక్ష్యంగా చేసుకుని తనం ప్రభావాన్ని చూపగా, రెండవ దశలో మాత్రం యువకుల్ని ఎంతగానే ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో లక్షల మంది తమ ప్రాణాలను కోల్పోయారు. రెండవ దశ కరోనా వైరస్ కారణంగా గత సంవత్సరం లాగే కరోనా వ్యాప్తిని తగ్గించడానికి లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ కారణంగా చిన్న చిన్న వ్యాపారాలు, ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ప్రభుత్వాలు సైతం వీరికి అవసరమైన సహాయకార్యక్రమాలను చేస్తూ ఉంది. లాక్ డౌన్ వల్ల నష్టపోయిన రంగాలలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి.

సినిమా రంగానికి చెందిన ఎంతోమంది రోజు వారీ కూలీలు ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వీరికి సినిమా పెద్దలు సహాయం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి ఎక్కువవుతుందనే కారణంతో లాక్ డౌన్ కన్నా ముందే థియేటర్లను మూసివేశారు. దానితో షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు సైతం విడుదలకు నోచుకోక ఎదురుచూస్తున్నాయి. ఒకవైపు ఓ టి టి ప్లాట్ ఫామ్స్ మంచి ఆఫర్ లనే ఇస్తున్నప్పటికీ కొన్ని సినిమాల దర్శక నిర్మాతలు డిజిటల్ గా విడుదల చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. మరియు కొన్ని సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే ఆగిపోయాయి. ఇప్పుడు వీరి బాధ వర్ణనాతీతం. దాదాపు చాలా సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి, 10 నుండి 15 రోజుల అవకాశం ఉంటే అవి పూర్తయిపోతాయి. ఆ తర్వాత యధాతధంగా రిలీజ్ కు సిద్ధంగా ఉంటాయి.

కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే ఎప్పటికీ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు షూటింగులకు అనుమతిని ఇస్తాయనేది తెలియడం లేదు. కానీ తాజా సమాచారం ప్రకారం కరోనా కేసులు తగ్గుతుండడంతో సినీ పరిశ్రమలో ఆశలు చిగురిస్తున్నాయి. అంతా అనుకుంటున్నా ప్రకారం జూన్ నెలాఖరు లేదా జులై మొదటి వారానికి కరోనా పూర్తిగా తగ్గుతుందని, ఆ తరువాత నుండి షూటింగులు ప్రారంభమవ్వొచ్చని ఊహిస్తున్నారు. మరి స్పష్టమైన సమాచారం తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగక తప్పేలా లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: