పవన్ అనవసర ప్రయోగం.. ఇది చెరిగిపోని మచ్చ..!!
బహుశా దేశం లో పది వరుస ఫ్లాపులు అయినా కూడా చెక్కుచెదరని ఇమేజ్ కలిగిన హీరో ఈయనే కావచ్చు. ఈతన కెరీర్లో హిట్ సినిమాల కంటే ఫ్లాప్ సినిమాలు ఎక్కువ. అయినా కూడా ఆయనపై అభిమానం కొంత కూడా తగ్గదు ఆయన అభిమానులకు. రాజకీయాల్లోకి వెళ్లి పరాభవాన్ని పొంది మళ్లీ సినిమాల్లోకి వచ్చినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి ఏమాత్రం డోకా లేదని ఇటీవల విడుదలైన వకీల్ సాబ్ ఈ సినిమా నిరూపించింది. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది.
ఇక పవన్ కళ్యాణ్ హీరో గా ఎంతో సాఫీగా కెరీర్ ను మలచుకోగా ఒక మచ్చ మాత్రం ఆయన కెరీర్లో ఎప్పటికీ ఉండిపోతుంది. అదే డైరెక్షన్. ఆయన తన స్వీయ దర్శకత్వంలో జానీ అనే సినిమా చేయగా అది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. రేణు దేశాయ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా పవన్ కళ్యాణ్ ఈ సినిమా ఎందుకు చేశాడు అని అప్పట్లో ఆయన అభిమానులు తలలు పట్టుకున్నారు. అప్పటికే వరుస ప్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్ హీరోగానే కొనసాగితే బాగుండేదని తన డైరెక్షన్ లో మంచి సినిమా చేయకపోయినా పర్వాలేదు కానీ ఇలాంటి సినిమా చేసి అభాసు పాలయ్యాడు అన్నది ప్రేక్షకుల వాదన. ఇలా పవన్ కళ్యాణ్ తన కెరియర్ లో డైరెక్షన్ చేసి పెద్ద పొరపాటు చేశాడని ఆయన అభిమానులు అంటున్న మాట.