చిరు బలవంతం వల్లే పవన్ ఆ సినిమా.. దారుణమైన ఫలితం!

P.Nishanth Kumar
మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లోనే అత్యధికంగా సినిమాల పరం గా విజయాల శాతాన్ని కలిగి ఉన్న హీరో. ఆయన కథల ఎంపికలో అయినా, సినిమా ఎంపికలో అయిన ఎంతో వైవిధ్యంతో పాటు మరెంతో నేర్పు కూడా ఉంటుంది. ఇక ఆయన బాటలో టాలీవుడ్ లోకి ఆయన ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు రాగా వారిలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు గా ఉన్నారు. తొలి చిత్రం వరకు మాత్రమే మెగాస్టార్ టాగ్ ను తగిలించుకున్న పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సొంతంగా తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పరుచుకున్నాడు.

అయితే ఆయన కెరీర్ లో పాపులారిటీకి క్రేజ్ కి ఇమేజ్ కి ఏమాత్రం డోకా లేకుండా ఎక్కువ సినిమాలు ఫ్లాప్ అవడం మాత్రం ఆయన అభిమానులు ఇప్పటికీ కలచివేస్తుంది. అలా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచిన ఓ చిత్రం అన్నవరం. భీమనేని శ్రీనివాసరావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ కంటే ముందు వీరి కాంబినేషన్ లో సుస్వాగతం అనే బ్లాక్ బస్టర్ మూవీ రావడంతో భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది అన్నవరం. తమిళంలో విజయ్ హీరోగా రూపొందిన సినిమాకి ఇది రీమేక్ గా గా సూపర్ గుడ్ ఫిలింస్ మరియు ఉషా పిక్చర్స్ బ్యానర్లపై ఎన్.వి.ప్రసాద్ పరాస్ జైన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఖర్చు ఏమాత్రం వెనకాడకుండా చేసిన ఈ చిత్రం 2006లో విడుదలైన ఊహించని విధంగా ఫ్లాప్ అయ్యింది. తొలివారంలోనే ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి వచ్చినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాని చూడలేకపోయామని అప్పట్లో కామెంట్లు చేశారు. రెండో వారం నుంచి థియేటర్లు ఖాళీ అయిపోవడంతో యావరేజ్  గా సరిపెట్టుకుంది అన్నవరం. అయితే ఈ సినిమాకి ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ కాదట. మెగాస్టార్ చిరంజీవి ని ఉద్దేశించే భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాలో పలు మార్పులు చేయగా అప్పటికే తనకున్న కమిట్మెంట్ ల వల్ల చిరంజీవి సినిమా చేయాలేని పవన్ కళ్యాణ్ కి అయితే ఇది బాగా సూట్ అవుతుంది అని చెప్పడంతో ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి వచ్చిందట.అలా అన్నయ్య మాట కాదనలేక పవన్ కళ్యాణ్ చేసిన ఈ చిత్రం ఫ్లాప్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: