మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది సాయి పల్లవి.ఆ సినిమాలో తన సహజ అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక టాలీవుడ్ లో మాత్రం 'ఫిదా' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది ఈ న్యాచురల్ బ్యూటీ.ఈ సినిమా తర్వాత ఈ అమ్మడికి తెలుగులో అగ్ర హీరోల సరసన వరుస అవకాశాలు వెల్లువెత్తడంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇదిలావుండగా కథల విషయంలో ఆచితూచి అడుగులు వేసే సాయి పల్లవి.. తన అందం విషయంలోనూ సహజంగా ఉండాలని ఎప్పుడూ అనుకుంటుందట.
ఎంత సహజంగా అంటే చివరికీ తన మొహంపై ఉన్న మొటిమలను సైతం మేకప్‌తో కవర్ చేసుకోదు.నిజం చెప్పాలంటే సహజంగా ముఖంపై మొటిమలు ఉంటే ఆ హీరోయిన్ ని చూడటానికి అస్సలు ఇష్ట పడరు మన తెలుగు ఆడియన్స్. యూత్ ని ఎట్రాక్ట్ చేయడానికి మన హీరోయిన్లు రకరకాల మేకప్ లు, క్రీమ్‌లు రాస్తుంటారు.కానీ సాయి పల్లవి మాత్రం అలా కాకుండా ప్రతీ సినిమాలోనూ మొటిమల తోనే కనిపిస్తూ ఉంటుంది.అయితే తాజాగా ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ న్యాచురల్ బ్యూటీ.. ప్రేమమ్ చిత్రానికి ముందు తాను కూడా మొటిమల విషయంలో చాలా కంగారు పడేదాన్నని చెప్పుకొచ్చిన సాయిపల్లవి..
మొటిమలు తగ్గడం కోసం ఎన్నో క్రీములను వాడానని చెప్పింది. అయితే ప్రేమమ్ సినిమా తర్వాత తనకు అభిమానులు పెరగడంతో.. తనను తనలాగే స్వీకరిస్తున్నారని అర్థమైందని చెప్పుకొచ్చింది. ఆత్మ స్థైర్యాన్ని మించిన అందం లేదని చెప్పిన ఈ భామ తనకు సహజంగా ఉండటమే ఇష్టమని చెప్పుకొచ్చింది.ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాలో నాగ చైతన్య కి జోడిగా నటిస్తోన్న ఈ భామ ఆ సినిమాతో పాటుగా దగ్గుబాటి రానా సరసన విరాట పర్వం సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.ఈ రెండు సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి...!!