ప‌వ‌న్‌- పూరీ కాంబోలో మూడో సినిమా రానుందా..?

జ‌న‌సేన పార్టీ కోసం పూర్తి స‌మ‌యం కేటాయించేందుకు ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గ‌తంలో సినిమాల‌కు విరామం ఇచ్చిన విష‌యం తెలిసిందే. ప‌లు కార‌ణాల వ‌ల్ల రాజ‌కీయాల్లో అనుకున్నంత విజ‌యం సాధించ‌లేక‌పోయినా ప‌వ‌న్‌కల్యాణ్ కు జ‌నంలో క్రేజ్ మాత్రం ఏమాత్రం త‌గ్ట‌లేద‌ని చెప్పాలి. ఎన్నిక‌ల‌య్యాక ప‌వ‌న్ వెండితెర‌కు రీ ఎంట్రీ ఇచ్చిన మూవీ ‘వకీల్ సాబ్’. ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. క‌రోనా ప్రభావం త‌రువాత థియేట‌ర్ల‌కు జ‌నాన్ని భారీగా ర‌ప్పించినక తొలి సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ చిత్రం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్ జోరు పెంచారు. వ‌రుస‌గా చిత్రాల‌ను లైన్‌లో పెడుతున్నారు. వీటిలో క్రిష్‌ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రంపై ప్రేక్ష‌కుల్లో మంచి అంచ‌నాలున్నాయి. ఆ త‌రువాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి చిత్రాలు వ‌రుస‌గా మొద‌ల‌వుతాయి. అంతేకాదు ‘అయ్యప్పనుం కోషీయుం’ రీమేక్ లో న‌టించేందుకూ ప‌వ‌న్‌క‌ల్యాణ్ సిద్ధ‌మ‌వుతున్నారు. చెప్పా2024 ఎన్నికల కోసం బ్రేక్ తీసుకోవడానికి ముందే ఈ సినిమాలన్నీ పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నాడు పవన్.
ఇదిలా ఉంటే టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్‌డ‌మ్ ఉన్న‌ప‌వ‌న్‌తో గ‌తంలో సినిమాలు తీయాల‌నుకున్నా ఆయ‌న రాజ‌కీయాల్లోకి వెళ్ల‌డంతో నిరాశ‌ప‌డిన ప‌లువురు నిర్మాత‌లు ఆయ‌న కాల్షీట్ల కోసం మ‌రోసారి క్యూ క‌డుతున్నారు. వీరిలో ‘జేబీ ఎంటర్టైన్మెంట్స్’ బ్యాన‌ర్‌పై చిత్రాలు నిర్మిస్తున్న‌ భగవాన్, పుల్లారావుల‌కు గ‌తంలో పవర్ స్టార్‌ కమిట్మెంట్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది త‌మ సినిమా ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని వారు కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. ఇక వీరి సినిమాకు డైరెక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌దానిపై కూడా వారు క్లారిటీగానే ఉన్నార‌ట‌. ప‌వ‌న్‌కల్యాణ్ కెరీర్ తొలినాళ్ల‌లో ఆయ‌న‌తో ‘బద్రి’ వంటి సూప‌ర్‌హిట్ చిత్రాన్ని తెర‌కెక్కించిన పూరీజ‌గ‌న్నాథ్ కే ఈ అవ‌కాశం ద‌క్క‌నున్నట్టు తెలుస్తోంది. పూరీ..ప‌వ‌న్‌తో తీసిన రెండోచిత్రం ‘కెమెరామన్‌ గంగతో రాంబాబు’ . ఈ చిత్రం అభిమానుల‌ను నిరాశ‌ప‌ర‌చిన నేప‌థ్యంలో..ఇప్పుడు మ‌రోసారి అవ‌కాశ‌మిస్తే ప‌వ‌ర్‌స్టార్ ఇమేజ్ కు త‌గ్గ క‌థతో మూవీని తెర‌కెక్కించాల‌ని పూరీ జ‌గ‌న్నాథ్ కసిగా ఉన్నాడ‌ట‌. 2024 ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌ర్ స్టార్ మ‌రోసారి సినిమాల‌క బ్రేక్ ఇచ్చే అవ‌కాశం ఉండ‌టంతో ఈ లోపు ఈ కాంబో కార్య‌రూపం దాలుస్తుందో లేదో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: