మహేష్ బాబు కెరీర్ లో ట్రెండ్ సెట్ చేసిన సినిమా అదే..?
ఒక జెంటిల్ మెన్ గా ఉంటూ.. మరోవైపు ప్రొఫెషనల్ కిల్లర్ గా మహేష్ బాబు చూపించిన నటనా చాతుర్యం వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. మహేష్ బాబు ఒక ఎత్తైన భవనం పై నుంచి ట్రైన్ పైకి దూకే సన్నివేశం అదిరిపోయింది అనే చెప్పాలి. ఈ సన్నివేశం తో పాటు.. మహేష్ బాబు కోట శ్రీనివాసరావుని టెలిఫోన్ సంభాషణలో బేరా మాడటం.. పూజారి తులసి చెట్టు వద్ద డబ్బులు వదిలేయడం.. బ్రహ్మాజీ తో ఫైట్ చేయడం.. వంటివి తెలుగు చిత్ర పరిశ్రమకి కొత్తగా పరిచయమయ్యాయి.
ప్రతినాయకుడిగా సోనుసూద్ కూడా బాగా నటించారు. పార్థసారథిగా మహేష్ బాబు త్రిష ఇంటికి వెళ్లడం.. వారి మధ్య రొమాంటిక్ ఘటనలు చోటు చేసుకోవడం.. మధ్యమధ్యలో త్రివిక్రమ్ అద్భుతమైన డైలాగులు రావడం సినిమాని మరింత ఇంట్రెస్టింగ్ గా మలిచాయి. పార్ధు గా మహేష్ బాబు అవతారం ఎత్తిన తర్వాత తనికెళ్ల భరణి తో చోటుచేసుకున్న సన్నివేశం కూడా సూపర్ గా ఉంటుంది. పంచ్ ఇస్తే రాళ్లు సైతం వరుసగా విరిగిపోయే సన్నివేశం కూడా కేక పుట్టిస్తుంది. క్లైమాక్స్ కూడా అతడు చిత్రానికి ప్లస్ పాయింట్ అయింది. మహేష్ బాబు కెరీర్ లో పోకిరి తర్వాత భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా అతడు అని చెప్పుకోవచ్చు. అప్పట్లో ఈ సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది.