"రంగం" హీరోయిన్ ఆ రంగంలో బాగా సెటిల్ అయ్యిందిగా ?

VAMSI

సినిమా ఇండస్ట్రీ అనేది ఒక విచిత్రమైనదని చెప్పొచ్చు. ఇక్కడ అందరూ సక్సెస్ కాలేరు. అందరూ ఫెయిల్ అయ్యారని కూడా చెప్పలేము. ఎందరో నటీనటులు ఒకటి రెండు సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ తర్వాత వేరే వేరే కారణాలతో ఇండస్ట్రీని వదిలిన వారు చాలా మందే ఉన్నారు. అటువంటి ఒక సినిమా నాట్ గురించి మానము చెప్పుకుంటున్నాము. సీనియర్ నటి రాధ కూతురుగా సినీ రంగప్రవేశం చేసింది కార్తీక. ఈమె మొదటి సినిమానే టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున తనయుడు నాగచైతన్యతో చేసింది. ఈ సినిమా కమర్సియల్ గా హిట్ కాకపోయినా కార్తీకకు మంచి పేరునే తీసుకువచ్చింది. ఆ తర్వాత తమిళ డబ్బింగ్ మూవీ రంగం తో మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సారి కార్తీకకు మాములు హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది.

తమిళ హీరో జీవాతో చేసిన ఈ మూవీ తనకు నటిగా మరింత పేరును తీసుకువచ్చింది. ఇందులో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి.  ఈ గుర్తింపుతో వెంటనే కన్నడ మరియు మలయాళ భాషల్లో సినిమాలు చేసింది. కానీ అవేమీ ఈమెను హీరోయిన్ గా నిలబెట్టలేకపోయాయి. ఆ తర్వాత మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము సినిమాలో నటించింది. ఇందులో కార్తీకది సెకండ్ హీరోయిన్ పాత్ర కావడంతో అంతగా ప్రాధాన్యత రాలేదు.  ఈ కారణంగా ఈ సినిమా కూడా తనకు  స్టార్ డమ్ ను ఇవ్వలేకపోయింది. ఇక చివరి ప్రయత్నంగా అల్లరి నరేష్ హీరోగా నటించిన బ్రదర్ అఫ్ బొమ్మాలి సినిమాలో డాన్ పాత్రలో అలరించింది.

తన తల్లి రాధ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. చాలా కాలంపాటు హీరోయిన్ గా తనదైన మార్క్ చూపించింది. కానీ కార్తీక మాత్రం హీరోయిన్ గా విఫలం అయింది. దీనితో చేసేదేమీలేక హోటల్ బిజినెస్ వైపు తన దృష్టిని మరల్చింది. యూడీఎస్‌ హోటల్‌ గ్రూప్‌ ను స్థాపించి. ఈ హోటల్స్ కు డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది. కార్తీక ఇలా హోటల్స్ బిజినెస్ ను చూసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. రానున్న రోజుల్లో మళ్ళీ హీరోయిన్ గా వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: