సినీ కార్మికులకు అండగా నిలిచిన 'ప్రభాస్' నిర్మాత..!!

Anilkumar
కరోనా మహమ్మారి వ్యాప్తితో దేశంలో ఉన్న అన్ని రంగాలు కుదేలయ్యాయి.ఉపాధి లేక కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇక సినీ కార్మికుల పరిస్థితి గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. సినిమా షూటింగ్స్ లేక ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారిని ఆదుకోవడానికి సినిమా పరిశ్రమకు చెందిన పలువురు హీరోలు, నిర్మాతలు, దర్శకులు ముందుకు వచ్చి వారికి తోచినంత ఆర్థిక సాయం చేస్తున్నారు.ఇటీవల కేజీఎఫ్ హీరో యశ్ కన్నడ సినీ ఇండ్రస్టీ కి చెందిన మూడు వేల కుటుంబాలకు సాయం అందించిన సంగతి తెలిసిందే.వారికి 3000 రూపాయల చొప్పున మొత్తం1.5 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నాడు.


ఇక తాజాగా ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో వివిధ విభాగాలకు చెందిన 3,200 మందికి ఏకంగా 35 లక్షల రూపాయలను విరాళంగా అందించారు.అంతేకాదు కర్ణాటక లోని మాండ్యలో రెండు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయడమే కాకుండా 20 ఆక్సిజన్ బెడ్లను అందుబాటులో తీసుకొచ్చారు.ఇక వీరి నిర్మాణ సంస్థ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా కేవలం పది రోజులు మాత్రమే షూటింగ్ ని జరుపుకుంది.అయినా కూడా ఈ చిత్రానికి పనిచేస్తున్న యూనిట్ సబ్యులకు 5,000 చొప్పున అందించి...


 ఈ కరోనా కష్ట కాలంలో వారి కుటుంబాలకు అండగా నిలిచింది.
మొత్తానికి వీళ్ళ బ్యానరే కాదు.. మనసు కూడా చాలా పెద్దదే అని నిరూపించుకున్నారు. ఇక సలార్ సినిమా విషయానికొస్తే..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అందులో ఒక పాత్రలో ముంబైకి చెందిన మాఫియా డాన్ గా కనిపించనున్నాడట. ఇక డార్లింగ్ సరసన మొదటి సారి శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.దాదాపు కేజీఎఫ్ సినిమాకి పనిచేసిన సాంకేతిక బృందమే ఈ సినిమాకి కూడా పని చేస్తున్నట్లు సమాచారం.ఇక వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: