సంక్రాంతి రేసులో మహేష్ సినిమా లేనట్టేనా..?
ఇక ఇది ఉండగా.. 2022 సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ చిత్రం పోస్ట్ పోన్ కాబోతుంది అన్న ప్రచారం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ద్ద సినిమాల షూటింగులు జూలై నుండీ మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇక హేష్ బాబు మాత్రం ఆగష్టులో ‘సర్కారు వారి పాట’ ని మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే బ్యాలెన్స్ షూటింగ్ చాలా ఉంటుంది కాబట్టి.. 2022 జనవరికి ఫినిష్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని చిత్ర పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక దసరాకి ‘ఆర్.ఆర్.ఆర్’, ‘రాధే శ్యామ్’ ‘పుష్ప’ వంటి సినిమాలు విడుదలవుతాయని అంటున్నారు.
అయితే వాటి దృష్టి ఇప్పుడు 2022 సంక్రాంతి పై పడిందని తెలిపారు. ఇక జనవరి నెలలో అటు ఇటుగా ఆ సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. అయితే ఈ ఏడాది మొత్తం థియేటర్లు 50 శాతం ఆక్యుపెన్సీతోనే నడుస్తాయని చిత్ర వర్గాలలో టాక్ వినిపిస్తుంది. అంతేకాదు.. ఈ ఏడాది పెద్ద సినిమాలను విడుదల చేస్తే భారీ నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉందని అంటున్నారు. ఇక ‘సర్కారు వారి పాట’ 2022 సమ్మర్ కు గాని విడుదలయ్యే అవకాశాలు లేదని సమాచారం.