షాక్ ఇస్తున్న సప్తగిరి వేదాంతం !

Seetha Sailaja
సునీల్ బ్రహ్మానందం లాంటి స్టార్ కమెడియన్లు ఇండస్ట్రీని శాసిస్తున్న రోజులలో వారు హీరోలుగా టర్న్ ఇచ్చుకుని  ఆ తరువాత వరస ఫ్లాప్ లతో తమ క్రేజ్ ను అనవసరంగా తగ్గించుకున్నారు. వారిద్దరు తమ హీరో కెరియర్ ప్రారంభంలో హిట్లు కొట్టినా తర్వాత కొన్ని వరుస ఫ్లాపులు ఎదురు కావడంతో తమ కెరియర్ దెబ్బతిన్నది అన్న విషయం వారికి చాలా ఆలస్యం గా తెలిసింది.  

దీనితో అటు తిరిగి కమెడియన్ గా ప్రయత్నించినా ఆశించిన రిజల్ట్ కనిపించకపోవడంతో వారంతా అంతర్మధనంలోకి వెళ్ళిపోయారు.    ఇలాంటి పరిస్థితి టాప్ కమెడియన్స్ కు ఎందుకు వస్తుంది అన్నవిషయానికి సంబంధించిన ప్రశ్న తనకు ఎదురైనప్పుడు కమెడియన్ సప్తగిరి ఒక ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సప్తగిరి ఈ కామెంట్స్ చేసాడు.

ప్రముఖ కమెడియన్ హీరోగా టర్న్ అయితే ఆ హీరో లైఫ్ అంతా అతడికి బోనస్ అంటూ అభిప్రాయపడుతున్నాడు. అంతేకాదు ఆతరువాత ఆ కమెడియన్స్ తమ హీరో కెరియర్ ను పూర్తిగా ఎంజాయ్ చేస్తారు అన్న అభిప్రాయంలో ఉన్నాడు. ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా రోజుకు 1 - 2 లక్షలు పారితోషికం  తీసుకునే రేంజ్ కి ఎదిగిన సప్తగిరి ఆ తరువాత హీరోగా మారి ముందులో పేరు తెచ్చుకున్నా ఆ తర్వాత మాత్రం యథావిధిగా ఫ్లాపులతో ఇబ్బందులు పడుతున్నాడు.

దీనితో మళ్ళీ కామెడీ రోల్స్ వైపు యూటర్న్ తీసుకోవాలని ప్రయత్నించినా అతడికి అవకాశాలు దక్కడంలేదు. ఒక్క మంచి
పాత్ర దొరికితే వెంటనే సప్తగిరి ట్రాక్ లోకి వచ్చేస్తాడు. తన బాడీ లాంగ్వేజ్ తో పాటు మంచి కామెడీ డిక్షన్ పై పట్టు ఉన్న కరోనా కష్ట కాలంలో తన స్నేహితులకు ఎంతో సాయం చేసిన సప్తగిరి ఒక మంచి మూవీ ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నాడు. దీనితో ఈ సెకండ్ వేవ్ పరిస్థితులు తరువాత సప్తగిరి గేమ్ ఛేంజర్ అవుతాడేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: