నెట్ ఫ్లిక్స్ కోసం కృషి చేస్తున్న యంగ్ డైరెక్టర్ ...

VAMSI
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న డైరెక్టర్ లకు కొదువలేదు. చిన్న చిన్న కాన్సెప్ట్ లతో బ్లాక్ బస్టర్ విజయాలను సాధిస్తున్నారు. అటువంటి టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒక్కరే తరుణ్ భాస్కర్. సినిమాల్లోకి రాకముందు వెబ్ సిరీస్ లతో తన టాలెంటు నిరూపించుకున్నారు. ఈ క్రమంలోనే సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు పిలిచి మరీ డైరెక్టర్ గా మొదటి అవకాశాన్ని ఇచ్చారు. నిర్మాత తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా మొదటి సినిమా "పెళ్లి చూపులు" తోనే మంచి విజయాన్ని సాధించాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో నటించిన అందరికీ మంచి పేరును తీసుకువచ్చింది. ఈ సినిమా విజయంతోనే విజయ్ దేవరకొండకు మరిన్ని అవకాశాలు వచ్చాయి.

ఈ సినిమా సక్సెస్ తో మళ్ళీ "ఈ నగరానికి ఏమైంది" అనే సినిమాను తెరకెక్కించాడు. ఇది కూడా తరుణ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడేలా చేసింది. ఆ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టలేదు. కానీ 'మహానటి', 'ఫలక్ నుమా దాస్', 'మిడిల్ క్లాస్ మెలోడీస్' లాంటి సినిమాలలో ప్రత్యేక పాత్రలలో మెరిశాడు. అంతే కాకుండా తరుణ్ భాస్కర్ హీరోగా "మీకు మాత్రమే చెప్తా' అనే సినిమాను చేశాడు. ఇక తన రూట్ ను పూర్తిగా మార్చుకున్నాడు. వెబ్ సిరీస్ లవైపు తన దృష్టిని కేంద్రీకరించాడు. ఇందులో భాగంగానే నెట్ ఫ్లిక్స్ మరియు జీ 5 లాంటి డిజిటల్ ఫ్లాట్ పామ్ లలో పిట్టకథలు మరియు "రూమ్ నెం.54" ల నిర్మాణంలో భాగమయ్యాడు.

కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్ తో ఒక వెబ్ సిరీస్ చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది స్వయంగా దగ్గుబాటి రానా సలహా మేరకే చేస్తున్నట్లు వినికిడి. ఇప్పటి వరకైతే ఇది ఒక రూమర్ మాత్రమే. ఇందులో వాస్తవముందా లేదా అన్నది త్వరలోనే తెలియనుంది. ఇప్పటికి తరుణ్ భాస్కర్ సినిమా డైరెక్ట్ చేసి రెండు సంవత్సరాలవుతోంది. ఆ మధ్యనే ఒక సినిమా చేయనున్నాడని పుకార్లు వినిపించినా అది ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: