తెలుగు ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లుగా ఎదిగారు. అంతే కాదు తమ సంపాదనతో నిర్మాణ సంస్థలను కూడా స్టార్ట్ చేసి సినిమాలను నిర్మిస్తున్నారు చాలామంది డైరెక్టర్లు. వారెవరో చూద్దాం. దిగ్గజ దర్శకుడు రాజమౌళి విశ్వామిత్ర క్రియేషన్స్ అనే నిర్మాణ సంస్థను స్వయంగా స్థాపించాడు. ఇందులో ఎన్టీఆర్‌తో యమదొంగ మూవీని చేశారు. కానీ ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు ఈ బ్యానర్‌లో.
ఇక స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ కూడా గుణ టీమ్ వర్క్స్ అనే మూవీ బ్యానర్ ను నెలకొల్పాడు. ఇందులో అనుష్కతో రుద్రమదేవి మూవీని చేసి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు సమంతతో శాకుంతలం అనే పెద్ద ప్రాజెక్టు చేస్తున్నాడు. ఇక వీరి బాటలోనే క్లాస్ రెక్టర్ శేఖర్ కమ్ముల కూడా వెళ్తున్నారు. ఆయన అమిగోస్ క్రియేషన్స్ అనే బ్యానర్ సంస్థను స్టార్ట్ చేసి ఇందులో ఇప్పటికే చాలా సినిమాలు చేశారు.
ఇక టాలీవుడ్‌లోనే డాషింగ్ డైరెక్టర్ గా పేరున్న పూరీ జగన్నాథ్ ఇప్పటికే చాలా సినిమాలకు ప్రొడ్యూసర్ గా చేశారు. పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ అనేది ఆయన మొదటి బ్యానర్. దీని తర్వాత పూరీ కనెక్ట్స్ అనే మరో సంస్థను నెలకొల్పారు. వీటిల్లో చార్మీతో కలిసి ఎక్కువగా ఆయనే డైరెక్టు చేస్తున్న సినిమాలను నిర్మించారు.
ఇక సుకుమార్ కూడా సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థపై పలు సినిమాలు చేస్తున్నాడు. అలాగే క్రిష్ కూడా మొదటి నుంచి ఆయనే నిర్మాణ బాధ్యతలు చూసుకుంటున్నారు తన సినిమాలకు. ఇక సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అయితే ఆయన తీసే ప్రతి సినిమాను ఆయనే నిర్మిస్తుంటారు. ఇప్పుడు నాగ్ అశ్విన్ కూడా వీరి బాటలోనే రీసెంట్‌గా జాతిరత్నాలు మూవీని నిర్మించాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు నాగ్ అశ్విన్. అలాగే ఇప్పుడు స్వప్న సినిమాస్ బ్యానర్ పై మరిన్ని మూవీలను ప్లాన్ చేస్తున్నాడు ఈ దర్శకుడు.