రాజశేఖర్ కూతురుగా యంగ్ బ్యూటీ..

Divya

సినీ హీరో రాజశేఖర్ ఒకప్పుడు  సినిమాలతో బిజీగా ఉంటూ, ఫ్యామిలీ మ్యాన్ గా పేరు ప్రఖ్యాతలు పొందడమే కాకుండా మంచి హీరోగా కూడా ప్రేక్షకుల మదిలో నిలిచి పోయాడు. అయితే కొంతకాలం సినిమాలలో నటించి ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించినా,  మొన్న వచ్చిన గరుడవేగ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కల్కి సినిమా తీయగా,  అది ఫ్లాప్ గా నిలిచింది. ఆ సినిమా ఫ్లాప్ కారణంగా దాదాపు మూడేళ్లు మరోసారి సినిమాలకు దూరంగా ఉన్నాడు రాజశేఖర్. అయితే సుమన్ నటించిన  కపటదారి సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్నారు. ఇక ముందుగా హీరో రాజశేఖర్ గారే ఈ సినిమాకు హీరో గా ఎంపికయ్యారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా నుండి తప్పుకున్నాడు.


ఇక డైరెక్టర్ వీరభద్రం చౌదరి తో కూడా ఒక మూవీ ప్లాన్ చేయగా, అది కూడా పట్టాలెక్కలేకపోయింది. రీసెంట్ గా కొన్ని నెలల కిందట కరోనా బారిన పడిన రాజశేఖర్ పరిస్థితి చాలా సీరియస్  అయ్యింది. కానీ కరోనా నుంచి కోలుకున్న తరువాత ఈయన సినిమాల్లో నటిస్తాడాని అందరూ అనుకోగా.. రాజశేఖర్ ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.ఈ సినిమాలలో శేఖర్ సినిమా కూడా ఒకటి.


మలయాళ సినిమా జోసెఫ్ కు ఈ సినిమా రీమేక్.. ఇందులో  రాజశేఖర్ చాలా ఢీ గ్లామరస్ గా కనిపించబోతున్నాడు. ఎలాగంటే ముసలితనంలో రాజ్ శేఖర్ ఎలా వుంటారో అలాంటి క్యారెక్టర్ అని చెప్పవచ్చు. ఈ సినిమాని లలిత్ అనే ఒక యంగ్  దర్శకుడితో తీయబోతున్నారు. త్వరలో షూటింగ్ పనులు మొదలు పెడుతున్నారని  తెలిపారు. ఈ చిత్రం కోసం నటీనటుల కోసం వేట కూడా జరుగుతోంది. అయితే ఈ సినిమాలో రాజశేఖర్ సరసన మలయాళం హీరోయిన్ "అను సీతారా" ఎంపిక చేశారు.


ఇక ఇదే సినిమాలోని హీరో కూతురి పాత్ర కోసం జార్జి రెడ్డి హీరోయిన్ ముస్కాన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఈమెది కీలకమైన పాత్ర అని చెప్పుకొచ్చారు. ఇక రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక లు , ఎం ఎల్ వి సత్యనారాయణతో కలిసి ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం. దీనికి సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందిస్తుండడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: