టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకానొక దశలో స్టార్
హీరోయిన్ గా చక్రం తిప్పిన
కాజల్ అగర్వాల్ ఇటీవలే వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే
పెళ్లి తర్వాత హీరోయిన్లు సినిమాల్లో నటించడం తగ్గిస్తూ వస్తుంటే.. కానీ
కాజల్ మాత్రం ఇందుకు మినహాయింపుగా పెళ్ళి తర్వాత సినిమాల విషయంలో స్పీడ్ పెంచిందనే చెప్పాలి.పెళ్లికి ముందు అగ్ర హీరోల సరసన అవకాశాలు లేక
బెల్లంకొండ శ్రీనివాస్ వంటి మీడియం రేంజ్ హీరోలతో
సినిమా చేసి సరిపెట్టుకున్న ఈ భామ.. ఇప్పుడు
పెళ్లి తర్వాత అగ్ర హీరోలతో నటించడానికి సిద్ధమైంది. ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి సరసన ఆచార్య.. అలాగే
తమిళ సీనియర్
హీరో కమల్ హాసన్ ఇండియన్2తో పాటుగా తలపతి
విజయ్ తో తుపాకి సీక్వెల్ లో కూడా నటిస్తోంది కాజల్.
ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉన్నాయి.ఇక
పెళ్లి తర్వాత
కాజల్ ఈ సినిమాలతోనే సరిపెడుతుందేమో అని అనుకున్నారంతా.. కానీ ఈ అమ్మడు మాత్రం వరుస ప్రాజెక్ట్ లకు ఓకే చెప్తుందట.ఇప్పటికే
నాగార్జున నటిస్తున్న ఓ సినిమాలో
హీరోయిన్ గా ఎంపికైన కాజల్..'ఉమ' మరో పాన్
ఇండియా ప్రాజెక్ట్ లో లీడ్ రోల్ చేస్తోందట.ఇక తాజాగా ఈ అమ్మడికి మరో
బాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.కార్తీ హీరోగా తెరకెక్కిన
ఖైదీ సినిమా తమిళంలో తో పాటు తెలుగులో కూడా
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే సినిమాని
అజయ్ దేవగన్ హిందీలో
రీమేక్ చేస్తున్నాడు.
ఈ సినిమాలో
కాజల్ హీరోయిన్ గా ఎంపికైంది.ఐతే ఇక్కడ ఆశ్చర్య పడాల్సిన విషయం ఏంటంటే..
ఖైదీ ఒరిజినల్ వెర్షన్ లో అసలు
హీరోయిన్ పాత్రే కనిపించదు.సినిమాలో
హీరో భార్య చనిపోయిందని మాత్రమే చూపిస్తారు.అయితే
హీరోయిన్ ని
ఖైదీ సీక్వెల్ లో చూపించే అవకాశం ఉంది.అయితే ఒరిజినల్ లో ఒక్క సీన్ లో కూడా లేని
హీరోయిన్ పాత్రను
కాజల్ ఎలా ఒప్పుకుందనేదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది.అయితే
రీమేక్ విషయంలో మన
బాలీవుడ్ మేకర్స్ కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంటారు.మరి
కాజల్ కోసం ఫ్లాష్ బ్యాక్ లో ఏమైనా కొత్త స్టోరీని యాడ్ చేస్తారేమో చూడాలి...!!