బాలకృష్ణ గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?
నందమూరి బాలకృష్ణ నటసార్వభౌమడి పుత్రుడు అని అందరికీ తెలిసిన విషయమే. తండ్రి యొక్క నటనను ఉనికి పుచ్చుకొని, తండ్రికి తగ్గ తనయుడిగా, తండ్రితో సమానంగా సినిమాల్లో కూడా నటించి ,తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బాలనటుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నటసింహ అని ప్రేక్షకుల చేత బిరుదు పొందాడు. అంతే కాకుండా ఎంతో మంది స్టార్ హీరోయిన్లతో పాటు యంగ్ హీరోయిన్లతో కూడా కలిసి నటించి, స్టార్ హీరోలతో పాటు యంగ్ హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రస్తుతం ఏ హీరో కూడా ఈయన ఫీట్ ను అందుకోలేకపోతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.. అయితే ఈ రోజు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈయన గురించి మనం మరికొన్ని విషయాలను తెలుసుకుందాం..
సినీ ఇండస్ట్రీలో చాలామంది సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు. కానీ మన బాలకృష్ణ మాత్రం కేవలం ఫేస్ బుక్ లో మాత్రమే యాక్టివ్ గా ఉండడం విశేషం. ఈయనకు ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ఖాతాలలో అకౌంట్ లేదు.
ఈయనకు ఒక చిరకాల కోరిక కూడా ఉందట. అదేమిటంటే తన అన్నయ్య కొడుకు అయిన జూనియర్ ఎన్టీఆర్తో కలిసి ఒక చిత్రం తీయాలని , అందులోనూ మల్టీస్టారర్ మూవీ అయి ఉండాలని ఆయన తపన పడుతున్నారట.
ఎంతో ప్రతిష్టాత్మకంగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్న చిత్రం నర్తనశాల. అయితే ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది. కానీ సౌందర్య మరణించడంతో ఈ సినిమా విడుదలకు నోచుకోలేదు. కానీ పోయిన సంవత్సరం ఓటీటీలో ఈ చిత్రాన్ని బాలకృష్ణ విడుదల చేయగా , మంచి స్పందన లభించింది.
ఇక తన సినీ జీవితంలో తనకు మంచి గుర్తింపు తీసుకువచ్చిన సినిమా మంగమ్మ గారి మనవడు. ఇక అంతే కాదు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య369 ఎప్పటికైనా ఫ్యూచర్లో తిరిగి ప్రారంభించాలని ఆయన కలలుగంటున్నట్లు సమాచారం.
ఇక తన తన తండ్రి నందమూరి తారక రామారావు గారితో కలిసి ఏకంగా 12 సినిమాల్లో నటించారు.
సినిమాలలో నుండి రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి, అక్కడి ప్రజల ప్రేమాభిమానాలు గెలుచుకున్నాడు. ప్రస్తుతం కూడా ఎమ్మెల్యేగా కొనసాగుతూ అటు ప్రజలను ఇటు సినిమాల ద్వారా ప్రేక్షకులను తనవైపు తిప్పుకున్న ఏకైక వ్యక్తి అని చెప్పవచ్చు.
డైరెక్టర్ కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన విక్రమ భూపతి సింహ సినిమా దాదాపు పూర్తిగా ముగిసింది. కానీ చివర్లో కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగిపోవాల్సి వచ్చింది.