వైవిధ్యభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన యంగ్ హీరో అడవి శేష్ నటిస్తున్న తాజా చిత్రం మేజర్. 26/11 ముంబై ఉగ్రవాదుల దాడుల్లో మృతి చెందిన అమరవీరుడు మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడం విశేషం . తెలుగు అమ్మాయి శోభిత దూళిపాళ్ల హీరోయిన్ గా చేయగా, బాలీవుడ్ అందాల తార సయీ మంజ్రేకర్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు . శశికిరణ్ తిక్క ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రిన్స్ మహేష్ బాబు సోనీ పిక్చర్స్, ఏప్లస్ ఎస్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ కానుంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుండి అంచనాలను పెంచుకుంటూ పోతోంది.
మేజర్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కావడం, శశి కిరణ్ తిక్కా డైరెక్షన్ లో టాలెంటెడ్ హీరో అడవి శేష్ ప్రధాన పాత్రలో నటించడం, సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మాణ బాధ్యతలు చేపట్టడం ఇలా ఒక్కొక్కటి చేరి మంచి హైప్ ను తీసుకొచ్చాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, ఫస్ట్ గ్లిమ్స్, టీజర్లు ఇటు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ విశేష స్పందన తెచ్చుకొని, రికార్డులు సృష్టించి సినిమా అంచనాలను మరింత పెంచాయి. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా మార్కెట్ గురించే చర్చించుకుంటున్నాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ హక్కులు భారీగా అమ్ముడు పోయినట్లు సమాచారం. 'కేజీఎఫ్' వంటి సంచలన చిత్రాలను విదేశాల్లో మార్కెటింగ్ చేసిన డిస్ట్రిబ్యూషన్ కంపెనీ 'వీకెండ్ సినిమా' వారు ఈ చిత్రం ఓవర్సీస్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నారట.
మొదట ఈ సినిమా బిజినెస్ వేరేలా కనిపించినా ఆఫ్టర్ టీజర్ మరో స్థాయికి చేరుకోవడంతో ఈ చిత్రాన్ని సొంతం చేసుకోవడం కోసం భారీగా వెచ్చించక తప్పలేదట. సదరన్ స్టార్ ఇంటర్నేషనల్ భాగస్వామ్యంతో మేజర్ మూవీని కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ మరియు యుఎస్ఎ వంటి అగ్ర దేశాలలో మూడు భాషలలో విడుదల చేయబోతున్నారు. ఏదేమైనా అడవి శేషు కెరీర్ లోనే ఇది ఒక మెగా భారీ బడ్జెట్ మూవీగా మారింది. ఈ సినిమాకి రిటర్న్స్ ఆశించిన స్థాయి కంటే రెట్టింపుగా వస్తాయని అంచనా వేస్తున్నారు. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.