నమ్రతా శిరోద్కర్ నిర్మాతగా యంగ్ హీరోతో మంచి ఫీల్ గుడ్ సినిమా ?

VAMSI
1993 లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రతా శిరోద్కర్ ఆ తర్వాత సినిమాల వైపు అడుగులు వేశారు.  తెలుగులో వంశీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈమె అంజి, టక్కరి దొంగ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేశారు. తెలుగులో కంటే హిందీ పరిశ్రమలో ఈమె ఎక్కువ సినిమాలు చేశారు. అయితే తెలుగు స్టార్ హీరో మహేష్ బాబుని 2005 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వచ్చిన ఈమె ఫుల్ గా తన ఫ్యామిలీతో బిజీ అయిపోయారు. మరో వైపు వారి కుటుంబానికి సంబంధించిన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఇటీవలే నిర్మాతగా మారిన ప్రిన్స్ కు ఆయన భార్య నమ్రత సలహాదారుగా ఉంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నమ్రతా శిరోద్కర్ నేరుగా నిర్మాతగా మారాలనుకుంటున్నారట. 

ఇప్పటికే ఓ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పూర్తిగా నిర్మాణ బాధ్యతలను నమ్రతా శిరోద్కర్ చూసుకోబోతున్నట్లు సమాచారం. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ ప్రధాన పాత్రలో ఈ మూవీని నమ్రతా నిర్మించబోతున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ కాంబినేషన్ నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుందని సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రిన్స్ దగ్గరుండి మరీ నమ్రతను నిర్మాతగా మారేందుకు ప్రోత్సహించి ఒప్పించినట్లు తెలుస్తోంది. 


చాలా  మంది హీరోయిన్లు నిర్మాతలుగా మారిన సందర్భాలు చూశాం. అయితే ఇప్పుడు మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ కూడా అదే బాటలో నడవాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఈ వార్త విన్న మహేష్ అభిమానులు మరియు శర్వానంద్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఎప్పుడు ఈ సినిమా పట్టలెక్కనుందో తెలియాల్సి ఉంది. ఇదే కనుక నిజమైతే ఇకపై మహేష్ బాబు సినిమాలు సొంత బ్యానర్ పైనే తెరకెక్కనున్నాయని మరో టాక్ నడుస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: