మోక్షజ్ఞ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ కి కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం!
ఎందుకంటే బాలకృష్ణ ఇప్పటిదాకా హీరోగా మాత్రమే రాణించారు దర్శకుడిగా నర్తనశాల అనే సినిమా చేయడానికి ప్రయత్నించినా సౌందర్య మరణంతో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోయింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ ఏకంగా దర్శకుడు అవతారం ఎత్తుతారు అని చెప్పడం మాత్రం ఫ్యాన్స్ లో టెన్షన్ కలిగిస్తోందని చెప్పవచ్చు. ఎందుకంటే బాలకృష్ణ ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ హ్యాండిల్ చేయగలరా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అదీగాక ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు, సత్యానంద్ లాంటివాళ్ళు కథలు చెబితే తనకు నచ్చలేదని తాను చెప్పిన సబ్జెక్ట్ మాత్రం వాళ్ళకి వచ్చిందని ఆ సబ్జెక్ట్ తోనే ముందుకు వెళతామని చెప్పడంతో ఇప్పుడు వారిలో టెన్షన్ మొదలైంది. సబ్జెక్ట్ అందరికీ నచ్చేవిధంగా ఉంటే పర్లేదు కానీ ఏమైనా తేడా పడితే బాలయ్య మళ్లీ ట్రోల్ చేస్తారని అభిమానులు టెన్షన్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఒకపక్క మోక్షజ్ఞ లాంచింగ్ సినిమా న్యూస్ వచ్చేసిందని ఆనందపడాలో లేక బాలయ్య దర్శకత్వం వహిస్తానని చెప్పడంతో బాధపడాలో తెలియదా ఫ్యాన్స్ అంతా కాస్త టెన్షన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఇక మరో పక్క బాలయ్య తన డ్రీం రోల్ అయిన చంగిస్ ఖాన్ సినిమా కూడా ఎప్పటికైనా చేస్తానని వెల్లడించారు.