తమిళ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో రాకెట్ లా దూసుకుపోతున్న వరలక్ష్మి
శరత్ కుమార్ అక్కడ స్టార్ హీరోలతో సమానంగా పేరు తెచ్చుకొని సత్తా చాటుతోంది. ఇటు తెలుగులోనూ తన ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇక తెలుగులో
సందీప్ కిషన్ నటించిన
తెనాలి రామకృష్ణ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన వరలక్ష్మి
శరత్ కుమార్, ఆ తర్వాత
అల్లరి నరేష్ నాంది చిత్రంలో లాయర్ పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకుంది.
రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మగా తన నటనలో కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ
సినిమా ద్వారా వరలక్ష్మికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అటు
తమిళ పరిశ్రమతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీ లోనూ ఈమె క్రేజ్ మాములుగా లేదు.
నెగిటివ్ రోల్స్ చేస్తూ అందమైన పవర్ ఫుల్ లేడీ విలన్ గా ఆకట్టుకుంటున్న ఈ
భామ ఇప్పుడు
రామ్ చిత్రంలో సిఐడి పాత్రలో కనిపించనుందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. ప్రస్తుతం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ తమిళ డైరెక్టర్ లింగస్వామి ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పందెంకోడి, రన్, ఆవారా వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లింగస్వామి. ఇప్పుడు
రామ్ చిత్రంతో
డైరెక్టర్ గా డైరెక్ట్ గా తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు .అయితే ఈ
సినిమా అనంతరం
రామ్ పోతినేని చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్టు లో వరలక్ష్మి
శరత్ కుమార్ కూడా కీలక పాత్రలో నటించనున్నారట. ఈ చిత్రంలో సిఐడి పాత్ర కథకు చాలా కీలకమట. కాగా ఈ పాత్ర కు వరలక్ష్మి
శరత్ కుమార్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతారు అని చిత్ర బృందం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
అయితే ఈ
సినిమా డైరెక్టర్ ఎవరు ? కథ ఏంటి ? ఇతర పాత్రల వివరాల గురించి తెలియాలంటే
రామ్ నుండి లేదా చిత్ర
డైరెక్టర్ నుండి అధికారికంగా ప్రకటన రావాల్సిందే. ఇలా వరలక్ష్మికి తెలుగులో వరుస ఆఫర్లు వస్తున్నాయి. కాగా
రామ్ కెరీర్ కూడా అంత ఆశాజనకంగా లేదు.
ఇస్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టినా, వెంటనే
రెడ్ సినిమాతో
ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. మరి లింగుస్వామి
సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.