ప్రేమ దూరపై.. అల్లు అర్జున్ అడవి బాట పడతాడట?
ఇక స్టార్ హీరోల సినిమాలు అన్న తర్వాత అటు పుకార్లు కూడా మామూలుగా ఉండవు కదా.. ఈ క్రమంలోనే అటు పుష్ప సినిమాకు సంబంధించి రోజుకొక కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. అయితే ఇలా వైరల్ గా మారిన వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ అభిమానులను మాత్రం ఎంతగానో అలరిస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి మరో సరికొత్త గాసిప్ వైరల్ గా మారిపోయింది. ఇటీవలే విడుదలైన టీజర్ లో అల్లు అర్జున్ అడవుల్లో కనిపించాడు. అసలు అల్లు అర్జున్ అడవులకు వెళ్ళడానికి కారణం ఏంటి అనే దానిపై అభిమానులు ఆలోచనలో పడ్డారు.
అయితే పుష్ప సినిమాలో మొదట అల్లు అర్జున్ కి ప్రేమించిన అమ్మాయి దూరమైతే లవ్ ఫెయిల్యూర్ అవుతుందని.. ఇక ఆ బాధతోనే అల్లు అర్జున్ అడవుల్లోకి వెళ్ళి పోతాడని.. ఇక అక్కడి నుంచి అసలు కథ స్టార్ట్ అవుతుంది అని ఓ గాసిప్ ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తుంది. ఇది కాస్త అటు అల్లు అర్జున్ అభిమానులను కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. ఇక మొదట లవ్ ఫెయిల్యూర్ అయి అడవుల్లోకి వెళ్లిన అల్లు అర్జున్ మరోసారి రష్మిక తో లవ్ లో పడిపోతాడట. ఇలా కథ సాగిపోతుంది అనే టాక్ వినిపిస్తోంది ఇది ఎంతవరకు నిజమో తెలియదు గానీ ఈ గాసిప్ అభిమానులను తెగ ఆకర్షిస్తోంది.