వైరల్: కొత్త‌లుక్‌లో విక్ర‌మ్‌..!

Suma Kallamadi
కోలీవుడ్ హీరో విక్ర‌మ్ ఏ సినిమా చేసినాచాలా కొత్త‌గా ఉండేలా చూసుకుంటాడు. మిగ‌తా హీరోల‌కంటే ఆయ‌న సినిమాలు చాలా వెరైటీగా ఉంటాయి. అంతే కాదు ఆ సినిమాకు త‌గ్గ‌ట్టు ఆయ‌న గెట‌ప్‌కూడా చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు కూడా ఓ సినిమా కోసం మొత్తం మారిపోయాడు విక్ర‌మ్‌. ప్ర‌స్తుతం అజయ్ జ్ఞానముత్తు డైరెక్ష‌న్‌లో చేస్తున్న సినిమా కోసం విక్రమ్‌ 20 డిఫరెంట్‌ గెటప్స్‌లో న‌టిస్తున్నాడు.
ఇందుకు సంబంధించి విక్రమ్‌ లుక్‌ను డైరెక్టర్‌ అజయ్ రీసెంట్‌గా షేర్ చేయ‌డంతో విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది. ఈ పోస్ట‌ర్‌లో విక్ర‌మ్ లుక్ చాలా డిఫ‌రెంట్‌గా ఉంది. నల్ల గడ్డం, తెల్లని మీసాలతో వయసు పైబడిన ముస‌లాడిలా విక్ర‌మ్ చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. ఈ ఏడాది మార్చి నెలలో రష్యా దేశం లో కోబ్రా మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. కాగా అక్క‌డ కూడా కరోనా కేసులు విజృంభించడంతో తాత్కాళికంగా షూటింగ్‌కు విరామం ఇచ్చారు మేక‌ర్స్‌.

అయితే ఇప్పుడు అంత‌టా మళ్లీ సాధారణ ప‌రిస్థితులు రావ‌డంతో తిరిగి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అతి త్వరలోనే విక్ర‌మ్ మీద మూవీ షూటింగ్‌ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అయితే ఈ మూవీలో విక్రమ్‌ గణిత శాస్త్రవేత్తగా కొత్త రోల్ చేయ‌బోతున్నాడు. ఇందుకు సంబంధించిన టీజ‌ర్ వ‌చ్చి ఇప్ప‌టికే చాలా ఆక‌ట్టుకుంది. దీంతో విప‌రీతంగా అంచ‌నాలు పెరిగిపోయాయి.

ఈ సినిమాలో విక్ర‌మ్ చాలా ఫ్రెస్‌లుక్‌లో మెస్మ‌రైజ్ చేశాడు. ప్రతీ సినిమాలో త‌న లుక్ ఢిపరెంట్ గా ఉండేట‌ట్టు విక్రమ్ ప్లాన్ చేసుకుంటాడు. ఇక ఈ సినిమాలో ఏకంగా 20 గెటప్స్‌లో కనిపించనుండటం నిజంగా ఒక విశేషమ‌నే చెప్పాలి. .కాగా క్రికెట్‌ క్రీడాకారుడు ఇర్ఫాన్‌ ఖాన్ ఈ మూవీలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంటర్‌పోల్ ఆఫీస‌ర్ పాత్రలో ఇర్ఫాన్ కనిపిస్తున్నాడు. ఈ సినిమా ద్వారానే ఆయ‌న నటుడిగా త‌న కెరీర్ స్టార్ట్ చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: