భారీ స్కెచ్ వేసిన ఇలయతలపతి ... మ్యాటర్ తెలిస్తే మైండ్ బ్లాకే .... ??
కళానిథి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా అఫీషియల్ ప్రకటన ఇటీవల రాగా, ప్రస్తుత కరోనా పరిస్థితులు చక్కబడిన అనంతరం ఈ మూవీ షూటింగ్ ఆరంభించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ నటించనున్న ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. ఆ తరువాత దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక భారీ సినిమా చేయనున్నారు విజయ్. అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుందని టాక్.
మరోవైపు తెలుగు, కన్నడ భాషల హీరోల మాదిరిగా ఇకపై తన నుండి రాబోయే సినిమాలను పాన్ ఇండియా సినిమాలుగా విడుదల చేసి హీరోగా ఇతర భాషల్లో కూడా మంచి మార్కెట్, పాపులారిటీ సంపాదించాలనేది విజయ్ ఆలోచన అని అంటున్నారు. ఇక ప్రస్తుతం తన వద్దకు కథలు వినిపించేందుకు వస్తున్న కథకులు, దర్శకులకు యూనివర్సల్ అప్పీల్ ఉండే కథలు చెప్పమంటున్నారట విజయ్. ఈ విధంగా విజయ్ రాబోయే రోజుల్లో తన కెరీర్ విషయమై భారీ స్కెచ్ వేశారని, ఒకవేళ ఆయన నుండి త్వరలో రానున్న ఈ భారీ సినిమాలు కనుక మంచి విజయాలు అందుకుంటే హీరోగా విజయ్ స్థాయి విపరీతంగా పెరగడం ఖాయం అని అంటున్నాయి సినిమా వర్గాలు. మరి ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే, ఇలయతలపతి ఫ్యాన్స్ కి ఇది పెద్ద పండుగ న్యూస్ అనే చెప్పాలి .... !!