బాలకృష్ణ కోసం క్రాక్ సెంటిమెంట్ !
ప్రస్తుతం దర్శకుడు గోపీచాంద్ ఈసినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులలో బిజీగా ఉన్నాడు పల్నాటి ఫ్యాక్షన్ నేపథ్యంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ ఈసినిమాలో నటిస్తాడని తెలుస్తోంది. బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమాలు అన్నీ ఇంచుమించు హిట్ అయిన పరిస్థితులలో ఇంకా ఈ మూవీ ప్రారంభం కాకుండానే బ్లాకు బస్టర్ హిట్ అన్న ప్రచారం జరుగుతోంది.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా కుసంబంధించి స్టార్ కాస్ట్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నాడు. ఈసినిమాలో కూడ హీరోయిన్ ఛాన్స్ శృతి హాసన్ కు వచ్చే అవకాశం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శృతి మళ్ళీ కెరియర్ పై దృష్టి పెట్టడంతో వీలైనన్ని ఎక్కువ సినిమాలు వరసగా చేయాలని నిర్ణయించు కోవడంతో ఈ సినిమాకు సంబంధించి బాలయ్యకు హీరోయిన్ సమస్యలు తీరిపోయాయి అని అంటున్నారు. సెంటిమెంట్స్ ను బాగా ఫాలో అయ్యే బాలయ్యకు ఇప్పుడు ‘క్రాక్’ సెంటిమెంట్ ప్రభావితం చేస్తోంది అనుకోవాలి.