మనలో చాలామంది ఎదుటివారికి అందంగా కనిపించాలని అనుకుంటారు. ఇక హీరోహీరోయిన్లుగా చేసేవారి సంగతి ప్రత్యేకంగా చేపలిశ్న పనిలేదు. ఎందుకంటే చ్ కాస్త అందంగా కనిపిస్తే ప్రేక్షకులు బాగా ఇష్ట పడతారని భావిస్తారు. అందుకే చాలామంది
హీరోయిన్స్ డస్కీ లుక్స్ తో నటించాలంటే కాస్త అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఒకవేళ ఆ టైపు క్యారెక్టర్ లో కనుక నటించాలిసి వస్తే మన
హీరోయిన్స్ ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అయితే ఇప్పుడు
హీరోయిన్స్ ట్రెండ్ మార్చారు. చాలామంది
హీరోయిన్స్ డస్కీ లుక్స్ తో యాక్ట్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఆ పాత్రలో కూడా జీవించేస్తున్నారు వారు. మరి అలా నటించి
సక్సెస్ అయిన సౌత్
హీరోయిన్స్ ఎవరో ఒక లుక్ వేద్దాం.
ఈ మధ్య మన ఫైర్
బ్యూటీ సమంత ది ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సీరీస్ లో నటించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమాలో
సమంత డస్కీ స్కిన్ తో రాజీ అనే ఒక డిఫరెంట్ పాత్రలో నటించింది. ఈ సినిమాలో
సామ్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు అందుతున్నాయి. ఇంతకు ముందు కూడా
సమంత రంగస్థలం సినిమాలో ఇలానే నటించింది. అలాగే
కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేష్ కూడా అందంమైన లుక్ కంటే డస్కీ లుక్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. వరల్డ్ ఫేమస్ లవర్,
కౌసల్య కృష్ణమూర్తి సినిమాల్లో ఇలానే నటించింది.
అలాగే రంజన్ విజయన్ కూడా కరనన్ లో డస్కీ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంది. మంజు
వారియర్ అసురన్ సినిమాలో డస్కీ లుక్ తోనే నటించి మెప్పించారు. ఇంకా
హీరోయిన్ నయనతార కొలమవు కోకిల లో నటించారు. రీసెంట్ గా హిట్ అయిన ఆకాశమే నీ హద్దురా సినిమాలో సూర్యతో పాటు
హీరోయిన్ గా నటించిన
అపర్ణ బాలమురళి కూడా
మేకప్ కి ప్రాముఖ్యత ఇవ్వకుండా డస్కీ లుక్స్ తో కనిపించి అందరిని ఆకట్టుకున్నారు.
ఇంకా
నిత్యామీనన్ కూడా అంతే.
లారెన్స్ తెరకెక్కించిన
కాంచన -2 లో డస్కీ లుక్స్ తో కనిపించి అందరిని మెప్పించారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో
నిత్య ఒక వికలాంగురాలుగా కనిపించింది. ఫైనల్ గా అందం ప్రధానం కాదు, నటన అనేది ముఖ్యం.. మనకి ఇచ్చిన పాత్రకు న్యాయం చేశామా లేదా అనేది అంటూ మన సౌత్
హీరోయిన్స్ నటించి మెప్పిస్తున్నారు.