కన్నడ ముద్దుగుమ్మ
రష్మిక మందాన గుడ్‌బై
మూవీ షూటింగ్ నిమిత్తం ఇటీవలే ముంబయికి విచ్చేశారు.
అమితాబ్ బచ్చన్ నటిస్తున్న గుడ్‌బై చిత్రం
రష్మిక కి రెండవ
బాలీవుడ్ సినిమా కాగా.. ఈ ప్రాజెక్టు గురించి ఆమె చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్టు సినిమాలో అగ్రతారలతో కలిసి పని చేస్తూ తన వర్క్ లైఫ్ ని ఆమె బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ముంబై వెళ్లిన ఈ ముద్దుగుమ్మ ఇటీవల మాజీ నటీమణి
ఛార్మి కౌర్ ని కూడా కలుసుకున్నారు. తన పెట్‌డాగ్ ఆరా తో కలిసి తాను
ఛార్మి ని కలిసినట్టు వెల్లడించారు. ఈ
కరోనా మహమ్మారి సంక్షోభంలో
రష్మిక చెడు విషయాలన్నిటినీ మర్చిపోయి సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
విశేషం ఏంటంటే ఆమె తన జీవితంలో జరిగిన ముఖ్య విషయాలన్నింటినీ ఒక డైరీ రూపంలో ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో షేర్ చేస్తున్నారు. తాను నిన్నంతా ఏం చేశారో ఈరోజు ఆమె సోషల్
మీడియా వేదికగా వెల్లడించారు. "గుడ్‌బై
మూవీ షూటింగ్ పునః ప్రారంభించాను.. సెట్స్‌లో ప్రతి ఒక్కరూ ఆరా ని కలిశారు.. అలాగే దాన్ని బాగా ఇష్టపడ్డారు.. అందరినీ కలవడం చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది.. పార్థ మంగళ తో కలిసి వర్క్ గురించి, ఇతర విషయాల గురించి మాట్లాడాను.. కాసేపు ఆరాతో ఆడుకున్నాను.. కాసేపు వర్కౌట్ చేయగలిగాను.. నేను, ఆరా కొద్దిసేపు మంచిగా నిద్ర పోయాము," అని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ డైరీ లో పేర్కొన్నారు.
ఇకపోతే నేషనల్
క్రష్ రష్మిక "మిషన్ మజ్ను" అనే ఒక
బాలీవుడ్ చిత్రంలో
సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటిస్తున్నారు. ఈ
హిందీ చిత్రాన్ని మినహాయించి ఆమె తెలుగులో
అల్లు అర్జున్ కి జంటగా పుష్ప సినిమాలో నటిస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని 2 భాగాలుగా విడుదల చేయనున్నారు.