14 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ శివాజీ..

Purushottham Vinay
సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి పెద్ద సూపర్ స్టార్.ప్రజలకు గుర్తుండిపోయే సినిమాలు ఎన్నో చేశాడు.ఇక సూపర్ స్టార్ నటించిన సినిమాలలో ఎన్నటికీ గుర్తుండిపోయే సినిమాలలో 'శివాజి' ఒకటని చెప్పాలి.అప్పటివరకు సౌత్ లో వచ్చిన మూవీస్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ 'శివాజి'.ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే బాగా చదువుకున్న ఓ ఎన్నారై ఇండియాలో దాగి ఉన్న బ్లాక్ మనీని బయటకు రప్పించి ప్రజలకు బ్లాక్ మని డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టాడు అనే సూపర్ థీమ్ తో ఈ చిత్రం తెరకెక్కింది.ఇక ఈ సినిమా 2007 వ సంవత్సరం జూన్ 15న ఈ చిత్రం విడుదలైంది.

ఈ రోజుతో ఈ సినిమా విడుదలై 14 ఏళ్ళు పూర్తి కావస్తోంది. తమిళంలో పాటు తెలుగులో కూడా ఈ సినిమా పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.తమిళ ప్రేక్షకులు కంటే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా ఆల్ టైం ఇండియా ఇండస్ట్రీ హిట్ అయ్యింది. ఇక 'శివాజి' తెలుగులో ఈ సినిమాకి రూ 15.32 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ డబ్బింగ్ సినిమాకి ఇంత ఎక్కువ బిజినెస్ జరగడం అదే మొదటి సారి. ఇక ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి తెలుగులో టోటల్ గా రూ.17.73 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇది కూడా ఓ ఆల్ టైం రికార్డ్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో బయ్యర్లకు రూ.2.41 కోట్ల లాభాలు అందించింది.
ఇక టోటల్ గా చూసుకున్నట్లయితే ఇక 2007వ సంవత్సరం నాటికి, "శివాజీ"  అత్యధికంగా వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇది మూడు వారాల్లోనే 100 కోట్లు వసూలు చేసింది. ఇక 100 కోట్లు వసూలు చేసిన మొదటి తమిళ సినిమాగా శివాజీ నిలిచింది. ఇక అంతేగాక అత్యంత వేగంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.ఇక ఈ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో ఫ్యాన్స్ కి ఎప్పటికి గుర్తుండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: