ఆ విషయంలో బన్నీని ఫాలో అవుతున్న రవితేజ..?
ఇక సంక్రాంతికి విడుదలైన క్రాక్ సినిమా సక్సెస్ తో జోరుమీదున్న రవితేజ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆయన రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత శరత్ దర్శకత్వంలో రవితేజ ఒక సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి రవితేజ ఒక విషయంలో బన్నీని ఫాలో కానున్నారని ఇండస్ట్రీలో టాక్. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమాలో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడతారనే సంగతి తెలిసిందే.
అయితే శరత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో రవితేజ సైతం చిత్తూరు యాసలో మాట్లాడనున్నారని సమాచారం. ఇక సినిమాల బడ్జెట్లు భారీగా పెరిగిన నేపథ్యం దర్శకులు, రచయితలు హీరోల పాత్రల్లో వైవిధ్యం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే రచయితగా ప్రూవ్ చేసుకున్న శరత్ మాండవ ఈ సినిమాతో దర్శకునిగా కూడా ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారట. అంతేకాదు.. క్రాక్ సినిమాలో ఒంగోలు యాసలో మెప్పించిన రవితేజ చిత్తూరు యాసలో ఎలా మాట్లాడతారో చూడాల్సి మరి.
రవితేజ రాజా ది గ్రేట్ సినిమా తరువాత సరైన హిట్ లేని ఆయనకు క్రాక్ సినిమాతో సక్సెస్ ఇచ్చింది. ఇక జులై నెల నుంచి రవితేజ శరత్ కాంబో సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అంతేకాదు.. 1990 బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటించనుండగా సెకండ్ హీరోయిన్ గా ఎవరు నటిస్తారో చూడాలి మరి.