గీత ఆర్ట్స్ లో శ్రీను వైట్ల సినిమా చేయబోతున్నారా..?
ఆ తరువాత శ్రీను వైట్ల రామ్ చరణ్ తో ‘బ్రుస్ లీ, వరుణ్ తేజ్ తో మిస్టర్, రవితేజ తో అమర్ అక్బర్ ఆంటోని’ వంటి సినిమాలు చిత్రీకరించారు. కానీ ఈ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఆయన ఇమేజ్ ను పాతాళానికి తొక్కేశాయి. ఇక గతంలో శ్రీను వైట్ల సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే నమ్మకం నిర్మాతలకు, అభిమానులకు ఉండేది.
ప్రస్తుతం శ్రీను వైట్లతో సినిమాలు చేయడానికి నిర్మాతలు ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది. ఇక ఆయన విష్ణు తో ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే చాలు అన్నట్టు ఉంది ఆయన పరిస్థితి. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత ‘డబుల్స్’ అనే మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నట్లు శ్రీను వైట్ల తెలిపారు. ఇక ఇదిలా ఉండగా..’గీతా ఆర్ట్స్’ బ్యానర్లో కూడా శ్రీను వైట్ల ఓ సినిమా చేయబోతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇక ఆ సినిమాకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటికి రాలేదు. ఆ సినిమాలో ఏ హీరోతో చేస్తాడు? చిన బ్యానర్లో చేస్తాడా..? పెద్ద బ్యానర్లో చేస్తాడా? అనే విషయాల పై స్పష్టత రాలేదు. ఇక గతంలో ఈ బ్యానర్లో ‘అందరివాడు’ అనే మాస్ మూవీ శ్రీను వైట్ల చేశారు. అయితే ఆ సినిమా అనుకునంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఈసారి చేయబోయే మూవీతో కం బ్యాక్ ఇస్తాడా? అనే డిస్కషన్లు కూడా ప్రస్తుతం షురూ అయ్యాయి.