గ్యాంగ్ లీడర్ తర్వాత ఆ సీనియర్ నటి ఏమైంది ?

VAMSI
ప్రముఖ సీనియర్ నటి శరణ్య తన సహజమైన నటనతో విశేష ప్రేక్షకాదరణ పొందింది. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అనేక సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. భాష ఎదైనా భావం పలికించి తన నటనా ప్రతిభతో  క్రేజ్ ను సంపాదించుకుంది. వేదం, రఘువరన్ బిటెక్, గ్యాంగ్ లీడర్, 'కొలమావు కోకిల'  చిత్రాల్లో ఆమె పాత్రకు ప్రజలు పట్టం కట్టారు. అంతగా ఈ చిత్రాలలో ప్రత్యేకించి అలరించారు శరణ్య.  "నాయగన్" చిత్రం ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తన ప్రతిభతో వరుస అవకాశాలు చేజిక్కించుకుంది. ఎన్నో చిత్రాలలో హీరోయిన్ గా చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకుంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అందులోనూ విశేష ఆదరణ పొందుతోంది. 


అయితే ఇంతటి క్రేజ్ పెంచుకున్న  నటి శరణ్య, నాని సినిమా గ్యాంగ్ లీడర్ తరువాత తెలుగులో కనిపించిందే లేదు. ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకుంది. శరణ్యకు కూడా మంచి పేరే వచ్చింది. అయినా ఏమైందో ఏమో గానీ ఆ తర్వాత మళ్లీ ఆమె తెలుగులో కనిపించలేదు.  ఒక్క సినిమాలోనూ ఆమె పేరు వినిపించింది లేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం తమిళ చిత్రాల్లోనే బిజీ అయ్యారు శరణ్య. కరోనా టైం లో కూడా ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో కీలక పాత్ర పోషించబోతున్నారు.


కానీ ఇక్కడ తెలుగులో మాత్రం ఒక్క నూతన సినిమా జాబితాలోనూ ఆమె పేరు వినిపించింది లేదు. కరోనా కారణంగా అటు ఇటు ఎందుకని ఒకే దగ్గర బిజీ అయ్యారా లేదా ఇక్కడ అవకాశాలు తగ్గాయా అన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ ఆఫ్టర్ కరోనా ఆమె మళ్ళీ తెలుగు లో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: