ఐశ్వర్యరాయ్ - విక్రమ్ విలన్ కు నిజమైన విలన్ ఎవరు?
మణిరత్నం దర్శకుడిగా అభిషేక్ బచ్చన్, విక్రమ్, ఐశ్వర్యారాయ్ బచ్చన్ ముగ్గురూ కలిసి సంయుక్తంగా నటించిన చిత్రం రావణ్ . ఈ చిత్రం 2010 జూన్ 18వ తేదీన కాంట్రవర్సీలు , నిరసనల మధ్య విడుదలైంది. సాధారణంగా దర్శకుడు మణిరత్నం గారికి పురాణాల మీద ఎక్కువ ఆసక్తి అలాగే అభిమానం కూడా. ఇక ఆయన అభిరుచికి తగ్గట్టుగా సినిమాలు అద్భుతంగా తెరకెక్కిస్తారు.ఇక అలా పుట్టుకొచ్చింది రావణ్ కథ. రావణుడి కథ, వాల్మీకి రచించిన రామాయణ పురాణాల ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ఐశ్వర్యరాయ్ తన సినీ జీవితంలో ఎన్నడూ కష్టపడని విధంగా ఈ సినిమాకు కష్టపడి నటించడం మరో విశేషం. ముఖ్యంగా ఈ సినిమాలో రాగిని (సీత ) పాత్రలో ఎంతో కష్టపడి అద్భుతంగా నటించింది ఐశ్వర్యరాయ్. అయితే ముఖ్యంగా ఈ సినిమాను రెండు భాషలలో విడుదల చేసినప్పటికీ , ఏ భాషలోను ఒకదానికొకటి పొంతన లేకుండా ఒక భాషలో హీరోగా, మరొక భాషలో విలన్ గా చూపించి అద్భుతంగా తెరకెక్కించారు. ఇంకా ఈ నటన కేవలం విక్రమ్ కి మాత్రమే సాధ్యం అని చెప్పవచ్చు.
ఇక రామాయణం లోని కొన్ని ఘట్టాలను ఇటీవల సమాజంలో పరిస్థితులకు అనుగుణంగా క్యారెక్టర్లను అద్భుతంగా తీర్చి దిద్దారు. ఇందులో ప్రియమణి కూడా నటించింది. కాకపోతే ఇందులో కన్ఫ్యూజన్ క్యారెక్టర్స్ వల్ల ఈ సినిమా డిజాస్టర్ అవడానికి ముఖ్య కారణం అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలి అంటే రామాయణంలో రావణుడు సీత దగ్గరకు కూడా వెళ్లలేదు. కానీ ఈ సినిమాలో రావణుడికి, సీతకు మధ్య చాలా క్లోజ్డ్ సీన్స్ క్రియేట్ చేయడం తో నిరసనలకు దారితీసింది. అంతేకాదు రావణుడిని దేవుడిగా కొలిచే శ్రీలంక ప్రజలు, ఈ సినిమాలో రావణుడిని రాక్షసుడిని చేసి చూపించడంతో దర్శకుడు విమర్శల పాలయ్యాడు.