పూరి జగన్నాధ్ మూవీలో ఛాన్స్ కొట్టేసిన యువ హీరో...

VAMSI
హ్యాపీ డేస్ చిత్రంతో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్ సిద్ధార్థ్ ఇక అప్పటి నుండి వెనుతిరిగి చూసింది లేదు. టాలెంట్ ఉన్న యంగ్ హీరోగా డిఫరెంట్ జోనర్ లో చిత్రాలు ఎంచుకుంటూ తెలుగు చలనచిత్ర చరిత్రలో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అయితే ప్రముఖ స్టార్ డైరెక్టర్ చిత్రంలో ఒక కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో తన దైన టేకింగ్ తో అని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న మాస్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తరువాత సినిమాలో నిఖిల్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే పాత్ర కాదట, దాదాపు అర గంటకు పైనే నిఖిల్ ఈ సినిమాలో కనిపించనున్నారని, ఆ పాత్ర సినిమాకి చాలా కీలకం అని తెలుస్తోంది. పూరి జగన్నాధ్ నిఖిల్ పాత్రను సరికొత్తగా మలచనున్నారట.
నిఖిల్ ఈ సినిమాలో పాత్ర కనుక హైలైట్ అయితే మరిన్ని పెద్ద సినిమాలలో అవకాశాలు వస్తాయి. పూరి జగన్నాధ్ సినిమాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇతని సినిమాలకు మరియు డైలాగులకు సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇదే ఊపులో విజయ్ దేవరకొండ తో "లైగర్" పేరుతో పాన్ ఇండియా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకోగా, కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాపై చిత్ర బృందం అంతా నమ్మకంగానే ఉంది. అయితే  ఈ అంశంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.

 ప్రస్తుతం హీరో నిఖిల్ ఓ వైపు మొండేటి చందు దర్శకత్వంలో కార్తికేయ 2 చిత్రం, మరోవైపు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో 18 పేజెస్ చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తదుపరి ప్రాజెక్ట్ కోసం స్వామిరారా సీక్వెల్ ను ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: